నాగ్‌పూర్‌కు చెందిన ఓ వైద్యుడు చాయ్ లేట్ గా ఇచ్చారని ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్లను వదిలిపెట్టి ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో మరో వైద్యుడిని అరేంజ్ చేయాల్సి వచ్చింది.
ముంబయి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. చాయ్ లేటుగా తెచ్చారని ఓ వైద్యుడు నలుగురు పేషెంట్లను ఆపరేషన్ థియేటర్‌లోనే వదిలి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆ నలుగురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జిల్లా వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో మరో వైద్యుడిని ఆపరేషన్ కోసం పంపించారు.
నాగ్‌పూర్‌లోని ఖాత్‌లో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది మంది మహిళలు ట్యూబెక్టమీ కోసం వచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వారు రాగా.. నలుగురికి డాక్టర్ ఆపరేషన్ చేశారు. అప్పటికే చాయ్ కావాలని డాక్టర్ అడిగారు. ఆ చాయ్ కొంచెం ఆలస్యమైంది. దీంతో ఆ వైద్యుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోయారు.
Also Read: ప్రధానమంత్రి మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. దేని గురించి అంటే?
మిగిలిన నలుగురు పేషెంట్లకు అప్పటికే అనస్థీషియా వేశారు. వారు మత్తులోనే ఉన్నారు. వారికి ఆపరేషన్ చేయకుండా డాక్టర్ భాలవి చాయ్ టైమ్ కు రాలేదని వెళ్లిపోయారు. దీంతో ఆ నలుగురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ఈ ఘటనను జిల్లా పరిషద్ వెంటనే పరిగణనలోకి తీసుకుంది.మరో వైద్యుడిని అక్కడికి పంపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు జరపడానికి వెంటనే ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది.