ముందు భర్త, ఇద్దరు పిల్లల్ని చంపి: వైద్యురాలి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Aug 20, 2020, 09:12 PM ISTUpdated : Aug 20, 2020, 09:23 PM IST
ముందు భర్త, ఇద్దరు పిల్లల్ని చంపి: వైద్యురాలి ఆత్మహత్య

సారాంశం

నాగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలకు మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది

నాగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలకు మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ సుష్మా రాణే, ఆమె భర్త ధీరజ్ ఇంట్లోనే విగత జీవులుగా పడి వుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని... సుష్మ ఇంట్లో రెండు సీరంజీలు, ఖాళీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు లేవని, వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని ఇరుగుపొరుగు పోలీసులకు తెలిపారు.

మంగళవారం ఉదయం కూతురితో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సుష్మ.. తిరిగి వచ్చేటప్పుడు మత్తుమందు ఇంజెక్షన్లను తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ ఏం జరిగిందో భర్త, ఇద్దరు పిల్లలకు అధిక మోతాదులో మత్తుమందును ఇచ్చి ఆ తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.

సుష్మా రాణే స్థానిక అవంతి ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త ధీరజ్ కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అధిక మోతాదులో మత్తుమందు తీసుకోవడం వల్లే వీరు చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families