రిచా నేగి అనే ఒక డాక్టర్ స్ట్రీట్ డాన్సర్ సినిమా లోని ఒక సూపర్ హిట్ పాటకు డాన్స్ చేసింది. స్వతహాగా బాక్సర్, డాన్సర్ అయినా ఈ యువ డాక్టర్ స్టెప్పులేసి జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు డాక్టర్లందరికి ఈ డాన్స్ ను అంకితం చేసింది.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతున్న నేపథ్యంలో... డాక్టర్లు ప్రజలను కరోనా వైరస్ నుండి తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుతున్నారు. వారు రేయనక పగలనకా కష్టపడుతూ ప్రజలను కాపాడుతున్నారు.
ఈ తరుణంలో రిచా నేగి అనే ఒక డాక్టర్ స్ట్రీట్ డాన్సర్ సినిమా లోని ఒక సూపర్ హిట్ పాటకు డాన్స్ చేసింది. స్వతహాగా బాక్సర్, డాన్సర్ అయినా ఈ యువ డాక్టర్ స్టెప్పులేసి జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు డాక్టర్లందరికి ఈ డాన్స్ ను అంకితం చేసింది.
ఈ డాక్టర్ పూర్తిస్థాయిలో ఫుల్ గా పీపీఈ కిట్ ను ధరించి పాటకు డాన్స్ వేయడం విశేషం. డాక్టర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ లాక్ డౌన్ కాలంలో పాజిటివ్ గా ఉండాలంటూ పేర్కొంది.
ఈ డాక్టరమ్మ డాన్స్ కి ఇంస్టాగ్రామ్ పూర్తిగా ఫిదా అయిపోయింది. ఈ డాక్టర్ డాన్స్ ని మెచ్చుకుంటూ చాలామంది సదరు డాక్టరమ్మని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆ డాన్స్ ని మీరు కూడా ఒకసారి చూసేయండి.