దారుణం: తప్పతాగి మహిళపైకి కారు ఎక్కించిన ఎస్సై

Published : Jul 04, 2020, 03:38 PM IST
దారుణం: తప్పతాగి మహిళపైకి కారు ఎక్కించిన ఎస్సై

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. తప్పతాగి కారు నడపడమే కాకుండా ఓ మహిళపైకి కారును ఎక్కించాడు. ఈ సంఘటన ఢిల్లీ సమీపంలో శుక్రవారం జరిగింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఎస్సై అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. తప్పతాగి ఓ మహిళపైకి కారును ఎక్కించాడు. కారు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు.

ఆ దారుణమైన సంఘటన శుక్రవారంనాడు జరిగింది. స్థానికులు ఆమెను కాపాడడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. మహిళపై నుంచి కారును పోనిచ్చిన తర్వాత అదే వేగంతో దూసుకెళ్లాడు. కారును ఆపలేదు. ప్రస్తుతం ఆ మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎస్సైని పోలీసులు అరెస్టు చేశారు.  

కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళ కారు బాయ్ నెట్ పైకి ఎగిరిపడిన దృశ్యం అందులో కనిపించింది. బాయ్ నెట్ పై నుంచి పడిన మహిళను స్థానికులు రక్షించడానికి ప్రయత్నించారు. అయితే డ్రైవర్ కారును స్టార్ట్ చేసి ఆమెపై నుంచి తోలాడు. 

మహిళ కిందపడిపోవడాన్ని గమనించిన స్థానికులు కొందరు కారును ఆపడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన ఘాజీపూర్ లోని చిల్లా గ్రామంలో చోటు చేసుకుంది. 56 ఏళ్ల ఎస్సై యోగేంద్రపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు