ఆయన కన్నీళ్లు చూసి బాధపడ్డాను.. సీఎం పళనీస్వామికి రాజా క్షమాపణలు.. !

Published : Mar 29, 2021, 01:10 PM IST
ఆయన కన్నీళ్లు చూసి బాధపడ్డాను..  సీఎం పళనీస్వామికి రాజా క్షమాపణలు.. !

సారాంశం

తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామికి డీఎంకే నాయకుడు ఎ రాజా ఎట్టకేలకూ క్షమాపణలు తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో తమిళనాడు సీఎం పళనీస్వామిపై తాను చేసిన వ్యాఖ్యల మీద సోమవారం ఎ రాజా క్షమాపణలు తెలిపారు. 

రాజా చేసిన వ్యాఖ్యలకు భావోద్వేగానికి గురైన సీఎం పళనీస్వామి కన్నీళ్లు పెట్టుకున్న ఒక్క రోజు తరువాత క్షమాపణలు చెప్పారు. నేను పళనీస్వామి మీద చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏడుస్తున్నట్టు చూసి చాలా బాధ పడ్డాను అని రాజా అన్నారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఇ పళనీస్వామి ఓ ర్యాలీలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తర చెన్నైలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించిన సీఎం పళనీస్వామితనపై డీఎంకే నాయకుడు రాజా చేసిన అవమానకర వ్యాఖ్యలపై స్పందిస్తూ కన్నీరు కార్చారు. 

తన తల్లి గురించి రాజా చేసిన వ్యాఖ్యలు తనను మానసికంగా బాధించాయని సీఎం చెప్పారు. ఇపీఎస్ చట్టవిరుద్ధంగా పుట్టిన అకాల శిశువు లాంటివాడని రాజా చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు.

కాగా ముఖ్యమంత్రి పళనీస్వామి తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన 
డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎ. రాజాపై గ్రేటర్ చెన్నై నేరవిభాగం పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?