కరుణ ఆరోగ్యంపై ఉత్కంఠ: ఆటోకు నిప్పు, డిఎంకె కార్యకర్తలపై లాఠీచార్జ్

First Published Jul 29, 2018, 11:03 PM IST
Highlights

డిఎంకె అధినేత కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వద్దకు డిఎంకె కార్యకర్తలు పెద్ద యెత్తున చేరుకుంటున్నారు. వదంతులు నమ్మవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ వారు వినడం లేదు.

చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వద్దకు డిఎంకె కార్యకర్తలు పెద్ద యెత్తున చేరుకుంటున్నారు. వదంతులు నమ్మవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ వారు వినడం లేదు. ఆస్పత్రి ప్రాంగణంలోకి వారిని అనుమతించడం లేదు. 

ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు, డిఎంకె కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిఎంకె కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. వేలచేరిలో డిఎంకె కార్యకర్తలు ఆటోకు నిప్పు పెట్టారు.

పోలీసులపై డిఎంకె కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ  సభ్యులు, మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకున్నారు. కరుణానిధిని శుక్రవారంనాడు కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. 

కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉందని, వదంతులు నమ్మవద్దని డిఎంకె నేత ఎ. రాజా కూడా చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

click me!