Latest Videos

కలవరపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1.. గత వేరియంట్ల కంటే వేగం..

By Sairam IndurFirst Published Dec 19, 2023, 10:27 AM IST
Highlights

దేశంలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్  జేఎన్.1 (New Covid Variant, Jn.1)వ్యాప్తి చెందటం కలవరపెడుతోంది. కేరళ (Kerala)లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యాప్తిపై అలెర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. 

దేశంలో తొలిసారిగా వెలుగుచూసిన కొత్త కరోనా వేరియంట్ జేఎన్.1 కలవరానికి గురి చేస్తోంది. ఈ వేరియంట్లు మానవ యాంటీబాడీల ప్రతిస్పందనను తప్పించే సామర్థ్యం ఉందని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే అది ఇతర గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే జేఎన్.1 ప్రాణాంతకం కాదని ప్రాథమిక సంకేతాలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఐదువేల వజ్రాలతో రామ్ మందిర్ థీం నెక్లెస్.. సూరత్ వ్యాపారి వినూత్న ప్రయోగం..

ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను సోమవారం అలెర్ట్ చేసింది. జిల్లా స్థాయి వరకు కోవిడ్ పరిస్థితిపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించింది. కాగా.. ఈ కొత్త వేరియంట్ పై ప్రముఖ కోవిడ్ స్పెషలిస్ట్, నేషనల్ ఐఎంఏ కోవిడ్ టాస్క్ఫోర్స్ కో-చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ ‘తెలంగాణ టుడే’తో మాట్లాడారు. కోవిడ్ సబ్ వేరియంట్ బీఏ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ ఈ జెఎన్.1. దీనికి మరింత రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇది గత వేరియంట్ కంటే అధిక సామర్థ్యంతో ఉంటుంది. 

ఇదిలావుండగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు జారీ చేసిన సలహాలో.. రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని, అవసరమైన ప్రజారోగ్య చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఇన్ ఫ్లూ ఎంజా అలాంటి వ్యాధులు, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) కేసులను జిల్లాల వారీగా నివేదించడాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని కోరింది. కోవిడ్ -19 టెస్టింగ్ మార్గదర్శకాల ప్రకారం అన్ని జిల్లాల్లో తగినంత పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషిలను ప్రారంభోత్సవానికి రావద్దన్న రామ్ టెంపుల్ ట్రస్ట్

ఈ వైరస్ సోకితే ఏ లక్షణాలు కనిపిస్తాయంటే ? 
కరోనా సోకినప్పుడు కనిపించే సాధారణ లక్షణాలే ఈ కొత్త వేరియంట్ వల్ల కూడా సంభవిస్తాయి. జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు వంటివి ఉంటాయి. జేఎన్.1 వైరస్ వ్యాప్తి చెందకుండా  నిరోధించేందుకు వీలుగా తరచుగా చేతులను శుభ్రపర్చుకోవాల్సి ఉంటుంది. మాస్కులు వాడడంతో పాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. 

Dawood Ibrahim Net Worth: అండర్ వరల్డ్ డాన్ గురించి షాకింగ్ విషయాలు.. దావూద్ మొత్తం సంపాదన ఎంతో తెలుసా..?

రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలు తినాలి. వ్యాక్సినేషన్ తో పాటు మాస్కులు ధరించడం ద్వారా  వైరస్ నుండి సంరక్షణ లభిస్తుంది. అయితే  వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యధికారులు సూచిస్తున్నారు.తరచుగా చేతులను శుభ్రపర్చుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

click me!