కరోనాతో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ మృతి

By narsimha lodeFirst Published Mar 17, 2021, 1:15 PM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ కరోనాతో బుధవారం నాడు మరణించారు.

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ కరోనాతో బుధవారం నాడు మరణించారు.

మంగళవారం నాడు ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించాడు.

దిలీప్ గాంధీ మరణంతో ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సంతాపం తెలిపారు.

అహ్మద్ నగర్ దక్షిణ ఎంపీ స్థానం నుండి దిలీప్ గాంధీ ఎంపీగా పనిచేశారు. 1999 ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆయన మూడుసార్లు ఎంపీగా హాజరయ్యాడు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 

1980లో కార్పోరేటర్ గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2019లో ఆయన బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. 

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి మోడీ ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.


 

click me!