తల్లిని చెంపదెబ్బ కొట్టిన కొడుకు.. ప్రాణాలొదిలిన వృద్ధురాలు.. !

Published : Mar 17, 2021, 12:24 PM IST
తల్లిని చెంపదెబ్బ కొట్టిన కొడుకు.. ప్రాణాలొదిలిన వృద్ధురాలు.. !

సారాంశం

ఢిల్లీలో దారుణం జరిగింది. 76యేళ్ల వృద్ధురాలిని సొంత కొడుకే చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు కిందపడి అక్కడికక్కడే మరణించింది. సీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. 

ఢిల్లీలో దారుణం జరిగింది. 76యేళ్ల వృద్ధురాలిని సొంత కొడుకే చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు కిందపడి అక్కడికక్కడే మరణించింది. సీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. 

ఢిల్లీ, ద్వారకలో 76యేళ్ళ వృద్ధురాలు అవతార్ కౌర్ తన 45యేళ్ళ కొడుకుతో సోమవారం సాయంత్రం వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి వచ్చిన కొడుకు తల్లిని గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో కిందపడ్డ కౌర్ అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. 

ఈ వీడియో ఆధారంగా బిందపూర్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), సెక్షన్ 304కింద ఆమె 45 ఏళ్ల కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ పార్కింగ్ విషయంలో పొరుగువారితో గొడవ పడింది. దీంతో వాళ్లు  పిసిఆర్ కాల్ కూడా చేశారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేటప్పటికే, ఫిర్యాదుదారుడు ఈ సమస్యను పరిష్కరించుకున్నామని, ఇకపై ఈ విషయాన్ని పొడిగించడం ఇష్టపడలేదని చెప్పారు.

ఆ తరువాత విషయం తెలిసిన కౌర్ కొడుకు పొరుగువారితో "గొడవ" గురించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇది పెరిగి కొడుకు తల్లి ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

అయితే పార్కింగ్ విషయం సద్దుమణిగాకా మరేదో విషయంలో కౌర్ కి, ఆమె కొడుకు రణబీర్, అతని భార్య మధ్య మరో వాదన తలెత్తిందని సిసిటివి ఫుటేజ్లో తేలింది. సంఘటన తరువాత కౌర్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారని సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ మీనా తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి, నిరుద్యోగి అయిన రణబీర్‌ను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం