Digital Voter ID: ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం...
Digital Voter ID: డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అటువంటి పరిస్థితిలో పౌరులు తమ ఓటర్ ID కార్డును తమతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఓటరు ID కార్డు అధికారిక రుజువుగా ఉపయోగించబడుతుంది. అటువంటి పరిస్థితిలో దానిని భౌతిక రూపంలో వెంట తీసుకెళ్లాలి. కానీ, కొన్ని సందర్బంలో దానిని తీసుకెళ్లడం మరిపోవచ్చు. అయినా ఏం ఫర్వాలేదు. నిమిషాల్లోనే డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం?
ఇది పూర్తి ప్రక్రియ.. స్టెప్ టు స్టెప్ ప్రాసెస్..
1వ దశ: ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://voters.eci.gov.in/login)లోకి వెళ్లాలి.
2వ దశ: అక్కడ మీ మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ కావాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత..మీ మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే, పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అలా పూర్తి చేయగానే..రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
3వ దశ: తర్వాత మీరు మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, కాప్చా నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
4వ దశ: ఆ తర్వాత.. request OTPపై క్లిక్ చెయ్యాలి. మీ మొబైల్ కి వచ్చిన OTPని ఎంటర్ చేసి, verify & login పై క్లిక్ చెయ్యాలి.
5వ దశ: ఇప్పుడు మీకు సైట్ లో కుడివైపు కింద మూలకు E-EPIC Download కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి.
6వ దశ: ఆ తరువాత Enter EPIC_NO అని కనిపిస్తుంది. అక్కడ మీ ఓటర్ ఐడీ కార్డుకి సంబంధించిన 10 అంకెల యునిక్ EPIC నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత Select Stateలో మీ రాష్ట్రంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత Search బాక్స్ క్లిక్ చెయ్యాలి.
7వ దశ: వెంటనే స్క్రీన్ పై ఐటర్ ఐడీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు సరైనవే అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు కింద ఉన్న send OTP క్లిక్ చెయ్యాలి.
8వ దశ: మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, మొబైల్‌కి వచ్చిన OTPని ఎంటర్ చేసి, verify బాక్స్ క్లిక్ చెయ్యాలి.
9వ దశ: ఆ తర్వాత మీకు PDF రూపంలో డిజిటల్ ఓటర్ ID కనిపిస్తుంది. డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు కోసం… download e-EPIC క్లిక్ చెయ్యాలి. వెంటనే pdf ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది.
10వ దశ: అలా డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ ను అవసరమైతే.. ప్రింట్ తీసుకోవచ్చు. లేమినేషన్ చేయించుకుని ఆధార్ కార్డ్ తరహాలో వాడుకోవచ్చు. లేదా మొబైల్‌లోనే సేవ్ చేసుకొని, అవసరమైనప్పుడు, ఎవరైనా అధికారులకు చూపించవచ్చు.
గమనిక: డిజిటల్ ఓటర్ ఐడీ కోసం మొబైల్ నంబర్‌ను ఓటర్ ఐడీ కార్డుకు అనుసంధానం చేయడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు ముందుగా KYC పూర్తి చేయాలి. అప్పుడు మీరు ఇ-ఓటర్ ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.