Voter ID Card: ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే  ఇలా చేయండి..

By Rajesh Karampoori  |  First Published Mar 15, 2024, 3:31 AM IST

Change Address on Voter ID Card:  2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓటర్ ఐడీ కార్డు చాలా ముఖ్యం. ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చాలనుకుంటున్నారా..? ఒక అడ్రస్ నుంచి మరో అడ్రస్‌కు మారారా? ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. సింపుల్ గా ఇంట్లో కూర్చోనే ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చుకోవచ్చు.


Change Address on Voter ID Card: 2024 లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.  ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డ్‌ను పొందడం చాలా ముఖ్యం. ఓటు వేయడానికి అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఓటరు గుర్తింపు కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు ఒకటి. అయితే.. ఓటర్ ఐడీలో ఏమైనా  చేర్పులు, మార్పులు చేసుకోవాలని భావిస్తున్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్ గా ఇంట్లో కూర్చోనే ఓటర్ ఐడీ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. 

ఐడీ కార్డుపై అడ్రస్ మార్చుకోవాలా..?

Latest Videos

undefined

మీరు మీ అడ్రస్ మార్చుకోవాలని భావిస్తే.. తొలుత  https://voters.eci.gov వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా  నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్(NVSP)‌లోకి వెళ్లి.. అందులో కనిపించే..  'ఫారం 8'ని పూరించడం ద్వారా ఓటరు ID కార్డ్‌లో మీ చిరునామాను సులభంగా సవరించవచ్చు. 

మొదట ఫారం-8ని నింపాలి :
 
​ఓటర్ల సేవా పోర్టల్‌ (NVSP) వెబ్‌సైట్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. దానిలో కనిపించే ఫారం 8 ద్వారానే ఓటర్లు తమ ఐడీల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. ఇంటి అడ్రస్‌, ప్రస్తుతం కార్డుపై వివరాల్లో మార్పులు, కొత్త ఓటర్ ఐడీ కార్డు కావాలన్నా ఇదే ఫారం సమర్పించాలి.

తొలుత https://voters.eci.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి . ఇప్పటికే ఉన్న ఖాతాను ఉపయోగించి లాగిన్ చేయండి లేదా మీకు ఖాతా లేకుంటే కొత్త ఖాతాను సృష్టించండి.

కొత్త ఖాతాను క్రియేట్ చేయండిలా..

>> సైట్ లో ఎగువ కుడి మూలలో ఉన్న "సైన్ అప్" బటన్‌పై క్లిక్ చేయండి.

>> కొత్త ఖాతాను క్రియేట్ చేయడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్, క్యాప్చా నమోదు చేయండి.

>> మీకు ఇప్పటికే ఖాతా ఉంటే.. లాగిన్ చేయడానికి మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా, OTPని నమోదు చేయండి.

>> ఆ తరువాత వెబ్‌సైట్ హోమ్ స్క్రీన్‌పై ఉన్న ఫారమ్ 8 పై  క్లిక్ చేయండి. ‘షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/రిప్లేస్ మెంట్ ఆఫ్ ఈపీఐసీ/ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ’ అని రాసి ఉండటంతో దానిపై ఫారం 8 అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
 
గమనిక : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మీ ఓటు మార్చేందుకు, ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చేందుకు Form 8 ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఒకే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మారినట్లయితే Form 8A పైన క్లిక్ చేయాలి.

>> ఇది మిమ్మల్ని మరొక పేజీకి నావిగేట్ చేస్తుంది.

>> తదుపరి స్క్రీన్‌లో   "సెల్ఫ్", “ఇతరులు” అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఏదోకటి ఎంచుకోండి. ఆ తరువాత EPIC నంబర్‌ లేదా ఓటర్ ఐడీ నంబర్ చేయమని అడుగుతుంది. 

>> ఐడీ నంబర్ ఎంట్రీ చేయడంతో మరో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిలో మీరు పేరు, అడ్రస్, ఇతర వివరాలు కనిపిస్తాయి. అవన్నీ నిర్ధారించడానికి ఓకే బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

>> ఆ తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్ పై షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం పరధిలో లేక బయట నివాసం ఉంటున్నారా అని అడుగుతుంది. మీ నివాస స్థానాన్ని బట్టి దీన్ని ఎంచుకోవచ్చు.

అప్పుడు మీకు ఫారం 8 కనిస్తుంది.

>> అందులో  నాలుగు భాగాలుంటాయి.  మొదటి భాగంలో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.

>> రెండో భాగంలో  వ్యక్తిగత వివరాలను భర్తీ చేయాల్సి ఉంది. 

>> మూడో భాగంలో మీరు మార్చుకోవాలనుకుంటున్న చిరునామాను పూరించి, దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 

>> నాలుగో భాగంలో డిక్లరేషన్ ఉంటుంది. ఆ తరువాత  రివ్యూ చూసుకుని.. అని వివరాలు సరైన విధంగా ఉంటే.. సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది.

>> అయితే మీరు మార్చుతున్న చిరునామాను తగ్గినట్లుగా ఓ ఐడీ ప్రూఫ్‌ సమర్పించాల్సి ఉంటుంది. అవి.. వాటర్/గ్యాస్ కనెక్షన్ (కనీసం ఏడాది)ఎలక్ట్రిసిటీ బిల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఇండియన్ పాస్ పోర్టు, రెవన్యూ డిపార్ట్ మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డు, రిజిష్టర్డ్ రెంట్ లీజ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్. 

ముఖ్య గమనిక: ఒకటి కంటే ఎక్కువ ఓటరు ID కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధమని పౌరులు గుర్తుంచుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల నుండి ఓటు కోసం నమోదు చేసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది.  చట్టం ప్రకారం శిక్షార్హమైనది.

click me!