Voter ID: ఓటు హక్కు ఉందా? ఉంటే.. ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా? ఓటరు నమోదులో ఏమైనా లోపాలు జరిగాయా? మీ ఓటరు ఐడీలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? మరీ వాటిని సవరించుకోవాలని అనుకుంటారా? ఇంతకీ ఏ ఫారమ్ ఎందుకో ఎలా నింపాలో తెలుసుకుందాం. !!
Voter ID: మీకు ఓటు హక్కు ఉందా? ఉంటే.. ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా? ఓటరు నమోదులో ఏమైనా లోపాలు జరిగాయా? మీ ఓటరు ఐడీలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? మరీ వాటి ఎలా సవరించుకోవాలని అనుకుంటారా? లేదా ఓటర్ల జాబితా నుంచి మీ పేరు తొలగించారా? మళ్లీ మీరు ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారా..? ఐతే కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఫారమ్ ను మళ్లీ భర్తీ చేసి.. ఓటర్ల జాబితాలోకి మళ్లీ ఓటరు గా నమోదు కావొచ్చు. ఇంతకీ ఏ ఫారమ్ ఎందుకో ఎలా నింపాలో తెలుసుకుందాం. !!
ఓటు నమోదు, సవరణల ఫారాలు ఇవే..
ఫారమ్ 6: ఇది 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి లేదా ఓటర్ ID కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫారం-6ను భర్తీ చేయాలి.
ఫారమ్ 6A: విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఈ ఫారమ్ ద్వారా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో గానీ, ఆన్‌లైన్ లో గానీ ఈ ఫారాన్ని నింపి పంపవచ్చు.
ఫారమ్ 6B: ఇది ఓటర్ IDతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఫారమ్.
ఫారమ్ 7: ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించడానికి ఈ ఫారమ్ ఉపయోగపడుతుంది. ఎవరైనా చనిపోయినా.. వేరే నియోజకవర్గానికి మారినా.. వేరే చోటికి బదిలీ అయినా ఈ ఫారం భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఫారమ్ 8: ఓటరు IDలో నమోదు చేసిన అంశాలను సవరించాలనుకున్నా లేదా జోడించాలనుకున్నా వారు తప్పనిసరిగా ఈ ఫారమ్‌ను పూరించాలి. ఓటర్ ఐడీలో పేరు, వయస్సు, బంధుత్వం ఫొటోల్లో తప్పులు ఉంటే ఈ దరఖాస్తుతో సరిదిద్దుకోవచ్చు.
ఫారం-8ఏ : ఓటు ఉన్న నియోజకవర్గ పరిధిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇల్లు మారినప్పుడు చిరునామా మార్పు కోసం ఈ దరఖాస్తును వినియోగించుకోవాలి.
ఓటరు నమోదుకు అవసరమైన పత్రాలు
ఆన్‌లైన్‌లో ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడానికి, ముందుగా ఈ పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం అవసరం. పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్, జనన ధృవీకరణ పత్రం, 5వ, 8వ లేదా 10వ మార్క్ షీట్, నివాస ధృవీకరణ పత్రం,ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా మీ గుర్తింపును రుజువు చేసే ఆధార్ పత్రాలలో ఏదైనా ఒకటి.