
Bipin Rawat: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్‌తో ప్రయాణిస్తున్న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కూలిపోయింది. ఈ సమయంలో సిడిఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, ఆయన సిబ్బంది, ఇతర అధికారులు ప్రయాణిస్తోన్నారు. ఈ ప్రమాదంలో ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కన్నుమూశారు.ఆయనతో పాటు 13 మంది కన్నుమూశారు. మృతిచెందిన వారిలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక కూడా ఉన్నారు.
హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే హెలికాప్టర్ క్రాష్ అయింది. 14 మందిలో ఏకంగా 11 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు 80 శాతం కాలన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కాలిన గాయాల తీవ్రత ఎక్కువ ఉండటంతో అత్యవసర చికిత్స అందిచినప్పటికీ ఆయన కన్నుమూశారు. బిపిన్ రావత్ మరణ వార్తను వాయుసేన అధికారికంగా ధృవీకరిస్తూ.. సాయంత్రం 6 గంటలకు ట్వీట్ చేసింది.
ఆయన గతంలో రావత్ ఛాపర్ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో చీతా ప్రమాదం నుంచి రావత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో రావత్ లెఫ్టినెంట్ జనరల్ గా పని చేస్తున్నారు. దిమాపూర్‌లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే చాపర్ కూలిపోయింది. చాఫర్ ఇంజిన్ సమస్యలు తలెతడంతో ఆ సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఒక కల్నల్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. జనరల్ రావత్ కు అప్పుడు స్వల్ప గాయాలయ్యాయి. కానీ, నేడు జరిగిన ప్రమాదంలో వీరా మరణం చెందారు.