మొట్టమొదటి భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కొయంబత్తూర్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. 1978 డిసెంబర్‌లో ఆర్మీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన బిపిన్ రావత్.. దేశ మొట్టమొదటి త్రివిధ దళాల అధిపతి (CDS )గానూ సేవలందించారు.
బిపిన్ రావత్ (Bipin Rawat) ఉత్తరాఖండ్‌లోని పూరీలో 1958 మార్చి 16న జన్మించారు. వారి కుటుబం చాలా ఏండ్లుగా ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగి సేవలందించారు. బిపిన్ రావత్ తన ప్రథమిక విద్యను డెహ్రడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ లో ప్రారంభించారు. ఆ తర్వాత సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరారు. అటునుంచి డెహ్రడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలోకి ప్రవేశించారు. అక్కడ బిపిన్ ప్రతిభకు 'స్వోర్డ్ అఫ్ ఆనర్' లభించింది. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC)-వెల్లింగ్టన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హయ్యర్ కమాండ్ కోర్సును యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్-ఫోర్ట్ లీవెన్ వర్త్ , కాన్సాస్ లో పూర్తి చేశారు. అలాగే మద్రాస్ యూనివర్సీటి లో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ డిగ్రీ, మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలను పూర్తి చేశారు. అలాగే, సైనిక మీడియా వ్యూహాత్మక అధ్యయనాల మీద పరిశోధనలకు గానూ మీరట్ లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ఫిలాసఫీలో డాక్టరేట్ అందించింది.
undefined
Also Read: Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా
Bipin Rawat 1978 డిసెంబర్ 16న గూర్ఖా రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌లో చేరి తన ఆర్మీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన తండ్రి కూడా అదే యూనిట్ లో పనిచేస్తున్నారు. ఆయన యుద్ధ నైపుణ్యాలను గమనించిన ఇండియన్ ఆర్మీ పలు కీలక ఆపరేషన్లలో ఆయన సేవలను ఉపయోగించుకుంది. రావత్ కు యుద్ధ విద్యలో అపార అనుభవం ఉంది. దేశ వ్యతిరేక, తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక ఆపరేషన్లలో పదేండ్ల పాటు సేవలందించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్న సమయంలో జమ్మూకాశ్మీర్ ఆర్మీ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూరీ, జమ్మూకాశ్మీర్ లలో మేజర్, కల్నల్ గా సేవలందించారు. సరిహద్దు వెంట Southern కమాండర్ గా III Corps 19th Infantry Division MONUSCO North Kivu కు నాయయత్వం వహించారు. బ్రిగేడియర్ పదోన్నది పొందిన తర్వాత Rashtriya Rifles, Sector 5, 5/11 Gorkha Riflesకు నాయకత్వం వహంచారు. బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి పొందిన ఆయన సోపోర్ లో 5 సెక్టార్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (మోనుస్కో)లో జరిగిన చాప్టర్ 62 మిషన్ లో బహుళజాతి బ్రిగేడ్ కు నాయకత్వం వహించగా, అక్కడ ఆయనకు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ ప్రశంసా పత్రం లభించింది.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?
మేజర్ జనరల్ గా పదోన్నతి అనంతరం రావత్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ 19వ పదాతి దళ విభాగం (ఉరి)గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో ప్రత్యేక పదవిలో సేవలు అందించారు. మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, మధ్య భారతదేశంలోని రీ ఆర్గనైజ్డ్ ఆర్మీ ప్లెయిన్స్ ఇన్ ఫాంట్రీ డివిజన్ (రాపిడ్) లాజిస్టిక్స్ స్టాఫ్ ఆఫీసర్, మిలటరీ సెక్రటరీ బ్రాంచ్ లో కల్నల్ మిలటరీ సెక్రటరీ మరియు డిప్యూటీ మిలటరీ సెక్రటరీ, జూనియర్ కమాండ్ వింగ్ లో సీనియర్ ఇన్ స్ట్రక్టర్ వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ 2019లో నియమితులయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి త్రివిధ దళాధిపతిగా Bipin Rawat కృషి చేస్తున్నారు. బుధవారం చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రణాలు కోల్పోయారు.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?