వందకోట్ల డిమాండ్.. కానీ వీరప్పన్ కు ఇచ్చింది రూ. 15 కోట్లే..!

By AN TeluguFirst Published Feb 9, 2021, 12:24 PM IST
Highlights

గంథపు చెక్కల దొంగ, స్మగ్లర్ వీరప్పన్ కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్‌ కుమార్ ను కిడ్నాప్ చేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రాజ్ కుమార్ ను విడుదల చేయడానిక వీరప్పన్ వంద కోట్ల వరకు డిమాండ్ చేశాడు. 

గంథపు చెక్కల దొంగ, స్మగ్లర్ వీరప్పన్ కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్‌ కుమార్ ను కిడ్నాప్ చేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రాజ్ కుమార్ ను విడుదల చేయడానిక వీరప్పన్ వంద కోట్ల వరకు డిమాండ్ చేశాడు. 

రాజ్ కుమార్ విడుదల కోసం కర్ణాటక సర్కారు భారీగా నగదు ముట్టజెప్పిందని ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాచార పాత్రికేయుడు శివసుబ్రహ్మణ్యన్ రాసిన పుస్తకంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌కుమార్‌ విడుదల కోసం మూడు విడతులుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ ప్రభుత్వం వీరప్పన్ కు అందజేసిందని పుస్తకంలో పేర్కొన్నారు. 

శివసుబ్రమణ్యన్‌ వీరప్పన్‌ జీవితంపై లైఫ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ వీరప్పన్‌ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. కన్నడ నటుడు రాజ్ కుమార్ కిడ్నాప్ విషయం అప్పట్లో దేశ, విదేశాల్లో వీరప్పన్ గురించి తెలిసేలా చేసింది. 

2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్‌ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్‌ అపహరించాడు. వీరిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. 108 రోజు తరువాత నవంబర్ 15న విడుదల చేశాడు. ఆ టైంలో రాజ్‌కుమార్‌ కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. 

రాజ్‌కుమార్‌ విడుదల కోసం వీరప్పన్ మొదట కోటి రూపాయలు డిమాండ్‌ చేశాడు. ఆ తరువాత క్రమంగా ఆ మొత్తం పెరుగుతూ పోయింది. చివరగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు అందించాలని డిమాండ్‌ పెట్టాడు. అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ఎం క్రిష్ణ శాటిలైట్‌ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపారు. రెండుసార్లు రూ.5 కోట్లు చొప్పున, తుది విడతగా రూ.5.22 కోట్ల నగదును పంపించారని పుస్తకంలో తెలిపారు. అయితే 2004, అక్టోబర్‌ 18న జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్‌ చనిపోయిన సంగతి తెలిసిందే.. 

click me!