Dharmapuri Aravind Biography: తెలంగాణ ప్రజానీకానికి పరిచయం అవసరంలేని నాయకుడు, రాజకీయాల్లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే లీడర్. కాంట్రవర్సీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్, ఆయనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
Dharmapuri Aravind Biography: తెలంగాణ ప్రజానీకానికి పరిచయం అవసరంలేని నాయకుడు, రాజకీయాల్లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే లీడర్. కాంట్రవర్సీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్, ఆయనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
ధర్మపురి అరవింద్ బాల్యం, కుటుంబ నేపథ్యం
ధర్మపురి అరవింద్ 25 ఆగస్టు 1976 లో జన్మించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ ఇద్దరి కొడుకులలో అరవింద్ చిన్నవాడు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు. అలాగే మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారు. అతని తాత ధర్మపురి వెంకటరామచంద్ర కాపు వర్గానికి చెందిన నేత.ఒకవైపు చదువు మరోవైపు క్రికెట్ ఆటలు రాణించారు ధర్మపురి అరవింద్.ధర్మపురి అరవింద్ 1995-96లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. అరవింద్ ట్రోఫీలో అండర్ 19, అండర్ 21, అండర్ 23 విభాగాలు ఆడారు. డెవలప్ అండర్ 19 సౌత్ ఇండియా తరఫున ఓపెనింగ్ బ్యాట్స్ మెన్స్ ఆయన. ధర్మపురి అరవింద్ భార్య ప్రియాంక. వీరికి ఇద్దరు కుమారులు.
రాజకీయ జీవితం
>> చిన్న వయసు నుంచి రాజకీయాలు దగ్గరగా చూసిన అరవింద్ కు ప్రజల సమస్యల పట్ల తొందరగానే అవగాహన పెరిగింది. రాజకీయాల్లోకి రాకముందే.. ప్రజల సమస్యల పట్ల తనవంతుగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
>> 2013లో ఆయన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ళలోపు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లల రక్షించడానికి ధర్మపురి ఫౌండేషన్ స్థాపించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు అలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
ధర్మపురి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా యాక్టివ్గా ఉన్నారు. రాజకీయాల్లో కీలకమైన నేతగా మారడానికి కారణం లేకపోలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్దీ మందిలో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒకరు.
>> 2019 పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఆనాటి సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవితకు పోటీ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కవిత తరుపున స్వయంగా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో ఓ రికార్డు క్రియేట్ చేశారు. అప్పట్టో ఈ విషయం హాట్ డిబెట్..
>> ఈ విజయంతో నిజామాబాద్ లోక్సభ పార్లమెంటు సభ్యులు అయ్యారు. అలాగే బీజేపీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ధర్మపురి అరవింద్ వ్యవహరించారు. పార్లమెంటు సభ్యుడు సంప్రదింపుల కమిటీ, వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ బిజెపి నేత ధర్మపురి అరవింద్ సందర్భాల్లో దూకుడు అయిన వ్యాఖ్యలకు కేరాఫ్ గా నిలిచారు.
వివాదాలు
ధర్మపురి అరవింద్ జీవితంలో పలు వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. 2019 ఎన్నికల ధర్మపురి అరవింద్ చదువుకున్న చదివినట్టు చూపించాలని అప్పట్లో టిఆర్ఎస్ నేతలు ఎందుకు సంబంధించి ఆధారాలు సైతం పక్కాగా సేకరించారు. దూర విద్య ద్వారా రాజస్థాన్లోని విద్యాపీఠ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ చదివినట్టు పొందుపరిచారు. అయితే.. రాజస్థాన్లోని సదరు యూనివర్సిటీలో ధర్మపురి అరవింద్ చదివారా? లేదా? అనేది ఆర్టిఐ ద్వారా వైరస్ నేతలు ఆ పేరుతో తమ యూనివర్సిటీలో ఎవరు చదవలేదని సమాధానం వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో అప్పట్లోహార్ట్ డిబేట్ అయింది.
నెట్ వర్త్
కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నవంబర్ 8న కోరుట్లలో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ధర్మపురి.. తనకులో 107 కోట్ల ఆస్తులు ఉన్నాయనీ, అలాగే తనపై 17 కేసులో ఉన్నాయని పేర్కొన్నారు.
ధర్మపురి అరవింద్ బయోడేటా
పూర్తి పేరు: ధర్మపురి అరవింద్
పుట్టిన తేది: 25 ఆగస్టు 1976 (వయస్సు 47)
పుట్టిన స్థలం: కోరుట్ల
పార్టీ పేరు : భారతీయ జనతా పార్టీ
విద్యార్హత: ఎంఏ (పొలిటికల్ సైన్స్)
వృత్తి: రాజకీయ నాయకుడు
తండ్రి పేరు: ధర్మపురి శ్రీనివాస్
తల్లి పేరు: ధర్మపురి విజయలక్ష్మి
జీవిత భాగస్వామి: ధర్మపురి ప్రియాంక ధర్మపురి
పిల్లలు: ఇద్దరు కొడుకులు
మతం: హిందూ
కులం: OBC
శాశ్వత చిరునామా: 164 A, రోడ్ నెం. 12, ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034