DGCA: ప‌క్షుల‌తో విమానాల‌కు ముప్పు..  DGCA నూత‌న‌ మార్గదర్శకాల జారీ..  

By Rajesh KFirst Published Aug 13, 2022, 10:55 PM IST
Highlights

DGCA: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పక్షులు, ఇతర వన్యప్రాణులు విమానాలను ఢీకొంటున్న ఘటనలు వెలుగులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఆ ప్ర‌మాద నివార‌ణ‌కు DGCA శనివారం ఎయిర్‌పోర్ట్‌ల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

DGCA: ఇటీవల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప‌క్షులు, ఇత‌ర వన్య‌ప్రాణులు విమానాల‌ను ఢీ కొట్టిన‌ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ప్రయాణీకులు విశ్వాసం కోల్పోతున్న‌ర‌నే వార్తలు ఎక్కువ వైర‌ల్ గా మారాయి. జూన్ 19న ఒకే రోజు మూడు విమానాల్లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌ల్లెతడం, ఈ క్ర‌మంలో విమానాలు ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ కావ‌డం వంటి ప‌లు ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే.. గతంలో పైలట్ల‌ చాక‌చ‌క్యంతోనే ఎన్నో విమాన ప్రమాదాలు నివారించబడ్డాయని దీన్నిబట్టి తెలుస్తోంది.

ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. డీజీసీఏ(DGCA) శనివారం ఎయిర్‌పోర్ట్‌ల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎయిర్‌పోర్టు అధికారులు సాధారణ పెట్రోలింగ్‌పై దృష్టి సారించాలని, పక్షుల కదలికలకు సంబంధించి పైలట్‌కు సమాచారం అందించాలని డీజీసీఏ ఆదేశించింది.  ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను ఆదేశించింది.  

గత వారం రోజులుగా పక్షులు విమానాలను ఢీకొన్న సంఘటనలు నమోదయ్యాయి. ఆగస్టు 4న అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌కు వెళ్లాల్సిన గో ఫస్ట్‌ విమానం పక్షిని ఢీకొనడంతో మళ్లీ అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. అలాగే..  జూన్ 19న 185 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల్లో పొగలు రావడం మొదలైంది. అలాంటి పరిస్థితిలో.. ఆ విమానాన్ని పాట్నా విమానాశ్రయం లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానానికి ప‌క్షి ఢీ కొట్ట‌డం వ‌ల్ల ఇంజన్ ఫెయిల్ అయ్యిందని, ఆ తర్వాత గుర్తించారు. నివేదిక ప్రకారం, గౌహతి విమానాశ్రయంలో టేకాఫ్ అయిన వెంటనే మరో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ విమానాన్ని కూడా ఓ పక్షి ఢీకొట్టినట్లు గుర్తించారు.
 
ప్రమాదాల నివార‌ణ కార్యక్రమాల‌పై సమీక్షించాలని అన్ని విమానాశ్రయ అధికారులను ఆదేశిస్తూ DGCA శనివారం మార్గదర్శకాన్ని విడుదల చేసింది. DGCA వన్యప్రాణుల ప్రమాదాన్ని అంచనా వేయాలని, విమానాలకు జరిగిన నష్టం కింద వాటిని ర్యాంక్ చేయాలని విమానాశ్రయాలను కోరింది. వన్యప్రాణుల సంచారాన్ని నమోదు చేసేలా ప్రక్రియను ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది. అలాగే.. ఏదైనా వన్యప్రాణులు( ప‌క్షులు) విమానం ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చి ఉంటే.. ఆ సమాచారాన్ని పైలట్‌కు అందించే ప్రక్రియ ఉండాలని సూచించారు.

click me!