
వివాహేతర సంబంధాల కారణంగా ఈ మధ్యకాలంలో దారుణాలు పెరుగుతున్నాయి. ప్రియుడి మాయలో పడి భర్తలను భార్యలు చంపుతుంటే.. అదే సుఖం కోసం భార్యలను మొగుళ్లు కడతేరుస్తున్నారు. ఇక వావి వరసలు మరిచిపోయి కొందరు వదిన, మరదలు, అత్త, పిన్నిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని మానవ సంబంధాలను మంటగలుపుతున్నారు. తాజాగా అత్తతో ఓ మేనల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను కడతేర్చాడు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు చెన్నపట్టణ పరిధిలోని మహదేశ్వర నగర్‌లో జూలై 15న ఒక ఇంటి బెడ్ రూమ్‌లో 33 ఏళ్ల వయసున్న వివాహిత హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేయగా.. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. అజయ్ అనే వ్యక్తి సదరు వివాహితకు వరుసకు మేనల్లుడు అవుతాడు. ఈ క్రమంలో అతనితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఆమె లేనిదే వుండలేకపోయిన అజయ్.. అత్తను తనతో పాటు వచ్చేయాల్సిందిగా పలుమార్లు ఒత్తిడి చేసేవాడు. కానీ పిల్లలను, భర్తను వదిలి అతనితో వెళ్లేందుకు మృతురాలు ససేమిరా అనేది.
ALso REad:Extramarital Affair: తండ్రి చనిపోయాడు.. తల్లి వివాహేతర సంబంధం.. కొడుకు ఏం చేశాడంటే?
దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. ఈ నెల 15న తన మామయ్య ఇంట్లో లేని సమయంలో అత్తను దారుణంగా హత్య చేశాడు. దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలే దారుణానికి పాల్పడ్డారని అందరినీ నమ్మించి తప్పించుకోవాలని భావించిన అతను.. మృతురాలి మెడలో మాంగల్యం, ఇతర విలువైన వస్తువులు, మొబైల్ తీసుకెళ్లిపోయాడు. అయితే ఎంత తెలివైన వారైనా చిన్న క్లూతో దొరికిపోతారన్నట్లుగా.. అజయ్ తన అత్త మాంగల్యాన్ని హలగూరులోని ఓ దుకాణంలో తాకట్టు పెట్టి దొరికిపోయాడు.