శబరిమలకు పోటెత్తిన భక్తులు: అయ్యప్ప దర్శనానికి 16 గంటలు

By narsimha lode  |  First Published Dec 19, 2023, 1:10 PM IST

కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనానికి  16 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 


తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పతనంతిట్టలో శబరిమల ఆలయానికి  మంగళవారంనాడు భక్తులు పోటెత్తారు.  దీంతో  అయ్యప్ప దర్శనం కోసం  వేలాది మంది భక్తులు  వేచి చూస్తున్నారు. 

 గంటల తరబడి మాల వేసుకున్న భక్తులు  దర్శనం కోసం  క్యూ లైన్లలో  వేచి ఉన్నారు. పంబలో రెండు కిలోమీటర్ల దూరంలో  క్యూలైన్ ఉంది.  అయ్యప్ప దర్శనానికి  16 గంటల సమయం పడుతుంది.  భారీ క్యూలైన్ల నేపథ్యంలో  భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వ సమన్వయలోపం కారణంగా పరిస్థితుల్లో మార్పులు రాలేదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Latest Videos

undefined

శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనం కోసం  ఈ ఏడాది నవంబర్  17న ట్రావెన్ కోర్  దేవస్థానం బోర్డు  అనుమతిని ఇచ్చింది.  మండల-మకరవిళక్కు సీజన్ కారణంగా  ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే చిన్నారులకు  ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  ప్రత్యేక గేటు ద్వారా చిన్నారులకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది. 

ఈ నెల  13వ తేదీన కేరళలో శబరిమలలో తొక్కిసలాట చోటు చేసుకుంది.  భారీ క్యూ లైన్ల నేపథ్యంలో స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో  భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది.  ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు.  

ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.  అయ్యప్ప మాలధారణ చేసుకున్న భక్తులతో పాటు ఇతర భక్తులు కూడ  స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున వచ్చారు.  భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రావెన్ కోర్ బోర్డు చర్యలు తీసుకోలేదు. దరిమిలా తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే  కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి  పినరయి విజయన్ కు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  రెండు రోజుల క్రితం లేఖ రాశారు.  అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం  సౌకర్యాలు కల్పించాలని  కోరారు.  శబరిమలలో చోటు చేసుకున్న పరిస్థితులను  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. 

ప్రతి రోజూ  శబరిమల ఆలయం దర్శనం కోసం 60 వేల నుండి లక్షలోపు భక్తులు వస్తున్నారు.  నిన్న నిమిషానికి  90 మందిని  18 మెట్లు దాటించారు. అయితే ఇవాళ్టికి పరిస్థితి మారింది. ఇవాళ క్యూ లైన్లలో భారీగా భక్తులు వచ్చారు.
 

click me!