గణపతికి రూ.6 కోట్ల విలువైన బంగారు కిరీటం.. ఫోటోలు వైరల్

By Siva KodatiFirst Published Sep 10, 2021, 5:04 PM IST
Highlights

పుణే నగరంలో శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి వినాయక ఆలయాలు ఎంతో ప్రాచీనమైనవి. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడి వినాయకుడికి భక్తులు ఖరీదైన బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. దీని విలువ అక్షరాల రూ.6 కోట్లు. 5 కిలోల స్వచ్ఛమైన బంగారంతో దీన్ని రూపొందించారు.

దేశవ్యాప్తంగా వినాయక చివితి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. వూరు వాడా గణేశుని విగ్రహాలను ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతిష్టించి.. బుజ్జి గణపయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇక గణేశ్ నవరాత్రులకు ప్రఖ్యాతి గాంచిన మహారాష్ట్రలోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణే నగరంలో శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి వినాయక ఆలయాలు ఎంతో ప్రాచీనమైనవి. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు.

తాజాగా, ఇక్కడి వినాయకుడికి భక్తులు ఖరీదైన బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. దీని విలువ అక్షరాల రూ.6 కోట్లు. 5 కిలోల స్వచ్ఛమైన బంగారంతో దీన్ని రూపొందించారు. శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణేశ్ ఆలయంలో ఈ పసిడి కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగ మెరుస్తున్న ఇక్కడి వినాయకుడ్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

click me!