గుడిలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న భక్తుడు... వీడియో వైరల్...!

By telugu news teamFirst Published Dec 6, 2022, 10:30 AM IST
Highlights

ఓ వ్యక్తి కూడా  గుడిలో ఉన్న ఏనుగు విగ్రహం కింద దూరేందుకు ప్రయత్నించాడు. అయితే.... ఈ క్రమంలో అతను ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయాడు. 


భారతదేశం విభిన్న మతాల నిలయం. దైవానుగ్రహం కోసం ప్రజలు తరచుగా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొన్నిసార్లు, ప్రజలు దేవతలను సంతోషపెట్టడానికి ప్రత్యేకమైన లేదా సవాలు చేసే పనిని చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు చూసే ఉంటారు. కొన్ని ఆలయాల్లో... చిన్న గుహలో  కూడా... చాలా భారీ కాయం ఉన్న మనుషులు కూడా దూరేస్తూ ఉంటారు. ఆ దేవుడి మహిమ కారణంగా అలా జరుగుతుందని నమ్ముతుంటారు. తాజాగా... ఓ వ్యక్తి కూడా  గుడిలో ఉన్న ఏనుగు విగ్రహం కింద దూరేందుకు ప్రయత్నించాడు. అయితే.... ఈ క్రమంలో అతను ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయాడు. దీంతో... దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


నితిన్ అనే వ్యక్తి ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గుజరాత్ లోని ఓ ప్రముఖ ఆలయానికి ఓ వ్యక్తి వెళ్లాడు. ఆ ఆలయంలో చాలా మంది... ఏనుగు విగ్రహం కింద నుంచి దూరి బయటకు వస్తూ ఉంటారు. అది  ఆచారంగా వస్తూ వస్తోంది. అయితే.... అందరూ చేసినట్లే ఓ వ్యక్తి చేయడానికి ప్రయత్నించాడు. కానీ... ఆ ప్రయత్నం బెడసి కొట్టింది. అతను... ఏనుగు కింద ఇరుక్కుపోయాడు.

Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij

— ηᎥ†Ꭵղ (@nkk_123)

అతను బయటకు రావడానికి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. అతను బయటకు రావడానికి ఆలయ పూజారి కూడా సలహాలు ఇచ్చాడు. అక్కడ ఉన్నవారు సైతం చాలా మంది అతను బయటకు ఎలా రావాలో.. వివరించారు. అయితే... అతను నిజంగా బయటకు వచ్చాడో లేదో మాత్రం తెలియలేదు. ఆ వీడియోలో పూర్తిగా లేదు. కాగా... ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి వ్యూస్ కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది.


ఆచారంలో భాగంగా, చిన్న ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య పాకుతూ ఒక మహిళా భక్తురాలు కూడా ఇరుక్కుపోయింది.  ఆ సంఘటన 2019లో జరిగింది.  ఆమె విగ్రహం నుండి బయటకు వచ్చేందుకు కూడా ప్రయత్నించింది. ఆమెను రక్షించడానికి చాలా మంది వచ్చారు. పాత వీడియో ప్రకారం, ఆమె చాలా సేపు చేసిన యుద్ధం తర్వాత గాయపడకుండా తప్పించుకోగలిగింది. ఆమె ప్రయత్నానికి స్థానికులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

click me!