దేవేంద్ర ఫడ్నవీస్ భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మహిళ అరెస్టు

By Mahesh KFirst Published Sep 14, 2022, 6:06 AM IST
Highlights

దేవేంద్ర ఫడ్నవీస్ భార్యకు ఫేస్‌బుక్‌లో ఓ మహిళ అభ్యంతరకర, అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేసింది. ఈ నేరానికి గాను ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వరకు ఆమె పోలీసు కస్టడీలో ఉండటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌పై అభ్యంతరకర కామెంట్లు చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అమృత ఫడ్నవీస్ ఫేస్‌బుక్ పేజీపై అభ్యంరతకరంగా కామెంట్లు చేసినందుకు 50 ఏళ్ల మహిళను సైబర్ పోలీసు డిపార్ట్‌మెంట్ మంగళవారం వెల్లడించింది. 

అమృత ఫడ్నవీస్ అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో స్మృతి పాంచల్ అనే 50 ఏళ్ల మహిళను అసభ్యకర, అభ్యంతరకర కామెంట్లు చేశారు. అనేక ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ల ద్వారా రెండు సంవత్సరాల పాటు ఆమె అమృత ఫడ్నవీస్ పై అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతూ వస్తున్నట్టు తెలిసింది.

అయితే, తన ఫేస్‌బుక్ పేజీలో అభ్యంతరకర వ్యాఖ్యల చేయడానికి స్మృతి పాంచల్ 53 ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలు, 13 జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు. గురువారం దాకా ఆ మెను పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు. అయితే, ఆమె అలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఇప్పటికిప్పుడు తెలియరాలేదని, ఆ విషయాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తామని వివరించారు.

click me!