ప్రధాని మోడీపై దేవేంద్ర ఫడ్నవీస్ భార్య సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే..?

By Rajesh KarampooriFirst Published Dec 22, 2022, 1:05 AM IST
Highlights

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆధునిక భారతదేశ పితామహుడిగా అభివర్ణించారు. దేశానికి ఇద్దరు జాతి పితాలు ఉన్నారని అన్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనదేశానికి ఇద్దరు జాతి పితామహులున్నారనీ, ఆధునిక భారత దేశానికి పితామహుడు నరేంద్ర మోదీ అని కీలక వ్యాఖ్యలు చేసింది.  మంగళవారం నాడు అభివ్యత్ వైదర్బియా లేఖికా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని ఆధునిక భారతదేశ పితామహుడిగా అభివర్ణించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తింది.  ఃవెంటనే వ్యాఖ్యత.. మరి మహాత్మా గాంధీ ఎవరు అని అడిగింది. ఆమె బదులిస్తూ..  మన దేశంలో ఇద్దరు జాతి పితామహులు ఉన్నారని అన్నారు. మహాత్మా గాంధీ ఆనాటి జాతిపితా అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ నవ భారత పితామహుడని పొగడ్తల వర్షం కురిపించింది. 

ఆమె ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించడం కొత్తేమి కాదు. 3 నెలల క్రితం కూడా అమృతా ఫడ్నవీస్ నరేంద్ర మోడీని జాతిపిత అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పేర్కొన్నారు.  ఆమె ప్రకటనపై బీజేపీ వ్యతిరేక పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  

'ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలి'

తన రాజకీయ ప్రవేశం గురించి అమృత మాట్లాడుతూ.. 'నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు. నా 24 గంటలూ రాజకీయ పనికి ఇవ్వలేను. నా భర్త సొసైటీ పనికి 24 గంటలు కేటాయిస్తున్నారు. అందుకే రాజకీయాలకు, సమాజానికి 24 గంటలు ఇవ్వగలిగిన వారు మాత్రమే రాజకీయాలు చేయడానికి అర్హులు. దేవేంద్రజీ ముఖ్యమంత్రి కావాలి. అన్నారు. 

ప్రధాని మోదీని కలిసిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని మోడీని  ఫాదర్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. అధికారిక సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. 'భారతదేశం ఇంతకు ముందు ఎలా ఉండేదో, విభజన జరిగింది, పోరాటం జరిగింది నాకు గుర్తుంది. ఆయన (ప్రధాని మోదీ) తండ్రిలా అందరినీ ఏకం చేశారు. అతను బహుశా భారతదేశ పితామహుడు. ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అని పేర్కొన్నారు. 

click me!