
వాట్సాప్ అకౌంట్లపై నిషేధం: ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారత యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. నవంబర్‌లో ఏకంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించినట్లు బుధవారం తెలిపింది. ఇది గత నెలలో నిషేధించబడిన ఖాతాల కంటే దాదాపు 60 శాతం ఎక్కువ అని తెలిపింది. యూజర్ల నుంచి ఎలాంటి రిపోర్ట్ రాకముందే యాక్టివ్‌గా ఉన్న 9.9 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్టు వాట్సాప్ తెలిపింది. అలాగే.. అక్టోబర్ నెలలో దేశంలో 23.24 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించగా.. వాటిలో చురుకుగా ఉంటే.. 8.11 లక్షల ఖాతాలు నిషేధించబడ్డాయి.ఐటీ నిబంధనలు 2021, 4(1)(డి) నిబంధనలకు అనుగుణంగా ఈ ఖాతాలను నిషేధించినట్టు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ వెల్లడించింది. స్పామ్, నిబంధనల ఉల్లంఘన, ఇతర కారణాలతో ఈ ఖాతాలను నిషేధించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. తమ ప్లాట్‌ఫాంపై యూజర్ల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తాజా నివేదికలో స్పష్టం చేసింది.
నెలవారీ నివేదిక ఏమి చెబుతుంది?
నవంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2022 వరకు 37,16,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించబడినట్లు వాట్సాప్( WhatsApp) తన నెలవారీ నివేదికలో పేర్కొంది. వీటిలో 9,90,000 ఖాతాలను వినియోగదారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకముందే నిషేధించబడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. భారత్ లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కు నవంబర్‌లో ఖాతాల తొలగింపుపై 946 ఫిర్యాదులను స్వీకరించింది. వాటిలో 74 ఫిర్యాదులపై చర్యలు తీసుకుంది. వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. "IT రూల్స్ 2021 ప్రకారం.. మేము నవంబర్ 2022 నెలలో మా నివేదికను ప్రచురించాము. తాజా నెలవారీ నివేదికలో నమోదు చేయబడినట్లుగా, నవంబర్ నెలలో 3.7 మిలియన్లకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించిందని తెలిపారు.
అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో ఎక్కువ ఫిర్యాదులు
అక్టోబరుతో పోలిస్తే నవంబర్ నెలలో వాట్సాప్ వినియోగదారుల నుండి నిషేధంపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. నవంబర్ నెలలో WhatsApp వినియోగదారుల నుండి 946 ఫిర్యాదులను అందుకుంది. వాటిలో 830 ఫిర్యాదులలో ఖాతాదారుని నిషేధించాలనే ఫిర్యాదు ఉంది. ఇందులో 73 ఖాతాలపై మాత్రమే చర్యలు తీసుకున్నారు.