అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ కథ రేపు చెబుతా.. హైడ్రోజన్ బాంబే వేస్తా.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్

By telugu teamFirst Published Nov 9, 2021, 9:16 PM IST
Highlights

మహారాష్ట్రలో మంత్రి నవాబ్ మాలిక్, ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుతున్నది. దీపావళి తర్వాత తాను అసలైన బాంబు వేస్తానని చెప్పిన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు నవాబ్ మాలిక్‌కు అండర్‌వరల్డ్ లింకులున్నాయని తాజాగా ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ రేపు తాను హైడ్రోజన్ బాంబు వేస్తారని నవాబ్ మాలిక్ అన్నారు.

ముంబయి: Maharashtraలో మంత్రి Nawab Malikకు ప్రతిపక్ష BJP నేత, మాజీ సీఎం Devendra Fadnavisకు మధ్య వాగ్వాదం పతాకస్థాయికి చేరుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్యకు డ్రగ్స్ పెడ్లర్‌తో సంబంధమున్నదని, ఓ డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఓ వ్యక్తి ఫైనాన్స్ చేసిన వీడియో మ్యూజిక్‌లో వీరు కనిపించారని, ఓ ఫొటోనూ నవాబ్ మాలిక్ బయటికి వదిలారు. ఈ ఆరోపణలు సంచలనం రేపాయి. వీటికి కౌంటర్ ఇస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇలాంటి ఆరోపణలే నవాబ్ మాలిక్‌పై చేశారు. 

నవాబ్ మాలిక్‌కు Underworldతో సంబంధాలున్నాయని దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. అంతేకాదు, దీపావళి తర్వాత ఈ విషయాలను వెల్లడి చేస్తానని అన్నారు. దీపావళి తర్వాత తాను బాంబు వేస్తానని చెప్పారు. తాజాగా, ఈ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ నవాబ్ మాలిక్‌పై ఆరోపణలు చేశారు. అండర్‌వరల్డ్  మనుషులతో, 1993 ముంబయి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో దోషులతో ఆయన ఓ డీల్ కుదుర్చుకుని ఆస్తి కొనుగోలు చేశారని ఆరోపించారు. మార్కెట్ రేట్ కంటే చౌకగా ఈ ఆస్తి కొనుగోలు చేశారని అన్నారు.

Also Read: Devendra Fadnavis: నవాబ్ మాలిక్ అండర్ వరల్డ్ వ్యక్తుల నుంచి భూమి కొన్నాడు.. సంచలన ఆరోపణలు చేసిన ఫడ్నవీస్

ఈ ఆరోపణలకు నవాబ్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు. తనకు అండర్‌వరల్డ్‌తో లింక్‌లు లేవని, కానీ, దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్నాయని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడూ వాటిని కొనసాగించారని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తాను హైడ్రోజన్ బాంబు వేస్తారని, ఓ ప్రెస్ మీట్ పెట్టి అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్న సంబంధాలను వెల్లడి చేస్తానని స్పష్టం చేశారు.

Also Read: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే కుట్ర.. సెల్ఫీ వైరల్ కావడంతో విఫలం : వాంఖడేపై మంత్రి ఆరోపణలు

1.5 లక్షల చదరపు అడుగుల భూమిని చీప్‌గా కొన్నామని ఆరోపణలు చేశారని, అంతేకాదు, అక్కడ నకిలీ కిరాయిదార్లనూ ఏర్పాటు చేశామని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారని నవాబ్ మాలిక్ అన్నారు. ఆ భూమి మునీరా పటేల్‌కు చెందినదని, కానీ సోలిడస్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ కంపెనీ ద్వారా గోడౌన్‌ల కోసం ఆ భూమిని లీజుకు తీసుకున్నామని వివరించారు. తర్వాత పటేల్ తమ దగ్గరకు వచ్చి భూమి తమకు అమ్మాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీంతో లీజుకు తీసుకున్న ఆ భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. వాస్తవ యజమాని ద్వారానే భూమి కొనుగోలు చేశామని తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఏ దర్యాప్తు ఏజెన్సీని ఆశ్రయించినా తనకు అభ్యంతరం లేదని, చట్టపరమైన చర్యలన్నింటినీ తాను ఎదుర్కోవడానికి సిద్ధమని వివరించారు. ఫడ్నవీసే అండర్‌వరల్డ్ విషయాన్ని బయటకు తీశాడని, ఇప్పడు ఆయనకు అండర్‌వరల్డ్‌తో ఉన్న లింకులను బట్టబయలు చేస్తానని అన్నారు. రేపు ఉదయం హైడ్రోజన్ బాంబు వేస్తానని తెలిపారు.

click me!