మన వీధి కుక్కలు విదేశాలకు.. చంపడానికి కాదు.. పెంచుకోవడానికి.. మీ వీధిలో ఉంటే చెప్పండి

First Published Jul 21, 2018, 4:13 PM IST
Highlights

వీధి కుక్కలు కనిపిస్తే రాళ్లతో కొట్టడమో లేదంటే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి పట్టుకుపొమ్మని చెప్పడమో జరుగుతుంది. అలా దుర్భరజీవితాన్ని గడుపుతున్న కుక్కలకు విలాసవంతమైన జీవితాన్ని అందిస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ.

వీధి కుక్కలు కనిపిస్తే రాళ్లతో కొట్టడమో లేదంటే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి పట్టుకుపొమ్మని చెప్పడమో జరుగుతుంది. అలా దుర్భరజీవితాన్ని గడుపుతున్న కుక్కలకు విలాసవంతమైన జీవితాన్ని అందిస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ. నోయిడాకు చెందిన ‘‘కన్నన్ ఎనిమల్ వెల్ఫేర్’’ అనే సంస్థ వీధులు, రోడ్ల వెంట తిరుగుతున్న కుక్కులను చేరదీస్తోంది.

వాటిని అడవుల్లో వదిలేయకుండా.. కుక్కలకు విదేశీయానాన్ని కలగజేస్తోంది. వీధుల వెంబడి కనిపించే కుక్కలను పట్టుకొచ్చి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. భారతీయ కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపే విదేశీలయుకు వాటిని దత్తత ఇస్తున్నారు.. ఇలా ఇప్పటి వరకు 90 కుక్కలను విదేశాలకు పంపారు. తమ ప్రయత్నం సఫలం కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీధుల వెంట కుక్కలు కనిపిస్తే తమకు సమాచారం అందించాల్సిందిగా వారు కోరుతున్నారు.
 

click me!