కేజ్రీవాల్ నివాసానికి నలుగురు సీఎంలు:రాజకీయ సంక్షోభం సృష్టించొద్దు

First Published Jun 16, 2018, 10:06 PM IST
Highlights

కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటించిన నలుగురు సీఎంలు


న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణతో నలుగురు రాష్ట్రాల సీఎంలు శనివారం రాత్రి సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ లు  ఢిల్లీలో కేజ్రీవాల్ సీఎం ఇంటికి వెళ్ళి ఆయన సతీమణితో సమావేశమయ్యారు.ఢిల్లీలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని నలుగురు సీఎంలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

ఐఎఎస్ అధికారులు సమ్మె విరమించుకొని విధుల్లోకి వచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సహచరులు ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో చేపట్టిన దీక్ష శనివారం నాటికి ఆరో రోజుకు చేరుకొంది.

న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఏపీ భవన్ లో కేరళ, బెంగాల్, కర్ణాటక సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశం నుండి నేరుగా  కేజ్రీవాల్ ను కలిసేందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు తమకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి అనుమతి కోరారు నలుగురు సీఎంలు.

కానీ, లెఫ్టినెంట్ కార్యాలయం నుండి కేజ్రీవాల్ ను కలిసేందుకు మాత్రం నలుగురు సీఎంలకు అనుమతి రాలేదు. అయితే కేజ్రీవాల్ సీఎం వద్దకు చేరుకొని కేజ్రీవాల్ సతీమణితో సమావేశమయ్యారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో సమావేశం కావాలని నలుగురు సీఎంలు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇంతవరకు అనుమతి రాలేదు. కేజ్రీవాల్ దీక్షను విరమించేలా లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా నలుగురు సీఎంలు మీడియాతో మాట్లాడారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అంతేకాదు సమాఖ్య వ్యవస్థలో ఈ రకమైన  పరిస్థితి రావడం దారుణంగా ఉందన్నారు.

దేశ రాజధానిలో తలెత్తిన ఈ పరిస్థితిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తలెత్తిన ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. 

మనమంతా  ప్రజాస్వామ్య  దేశంలోనే ఉన్నామని కేరళ సీఎం విజయన్ అభిప్రాయపడ్డారు. దేశమంతా కేజ్రీవాల్ వెంట ఉందన్నారు.కేజ్రీవాల్ కు తమ సంఘీభావం తెలుపుతున్నట్టు ఆయన చెప్పారు.

ఢిల్లీలో రాజకీయ సంక్షోభం తీసుకురాకూడదని బెంగాల్ సీఎం మమత బెనర్జీ డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా ఢిల్లీలో పాలన ఆగిపోయిందని ఆయన చెప్పారు. రాజకీయ సంక్షోభం తీసుకురాకూడదని ఆమె డిమాండ్ చేశారు. 
 

 


 

click me!