
న్యూఢిల్లీ: నోయిడాలోని (noida) 40 అంతస్థుల ట్విన్ టవర్స్ (twin towers) ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు (supreme court) గత మాసంలో ఇచ్చిన తీర్పును సవరించాలని సూపర్ టెక్ కంపెనీ (super tech )ఉన్నత న్యాయస్థానాన్ని బుధవారం నాడు ఆశ్రయించింది.
ఈ 40 అంతస్థుల భవనంలో 900 ఫ్లాట్లున్నాయి. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ ట్విన్ టవర్స్ నిర్మించడంతో ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది.ట్విన్ టవర్లలో ఒక్కదాన్నే కూల్చివేయాలని ఆగష్టు 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిపుణుల పర్యవేక్షణలో ఈ భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వంత ఖర్చులతోనే ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని కోరింది
ట్విన్ టవర్లలో ఒక్క టవర్ నే కూల్చివేస్తామని సుప్రీంకోర్టును కోరింది సూపర్ టెక్ సంస్థ. సుప్రీంకోర్టు తీర్పును, న్యాయవ్యవస్థనుసవాల్ చేయాలనుకోలేదన్నారు.ఈ టవర్లలో మొత్తం 915 ప్లాట్స్, 21 దుకాణాలున్నాయి. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణ సమయంలో రెండు టవర్స్ మధ్య కనీస దూరం పాటించలేదని చీఫ్ సైట్ ఆఫీసర్ నోయిడా అధికారులకు లేఖ రాసినా కూడ పట్టించుకోలేదు.దీనిపై రెసిడెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ న్యాయ పోరాటం చేయగా సుప్రీంకోర్టు వారికి ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని ఆదేశించింది.