డెల్టా ప్ల‌స్‌‌గా మారిన డెల్టా వేరియెంట్.. కాక్‌టైల్‌కు లొంగని వైనం, ప్రమాదకరమేనంటున్న నిపుణులు

By Siva KodatiFirst Published Jun 15, 2021, 8:33 PM IST
Highlights

భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియెంట్.. డెల్టా ప్లస్‌గా మ్యూటెంట్ అయినట్లుగా నిపుణులు చెబుతున్నారు. కాక్‌టైల్ ట్రీట్‌‌మెంట్‌కు డెల్టా ప్లస్ మ్యూటెంట్ లొంగడం లేదని తెలుస్తోంది. యూరప్‌లో మార్చి నుంచి కొత్త వేరియెంట్ కనిపిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు

భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియెంట్.. డెల్టా ప్లస్‌గా మ్యూటెంట్ అయినట్లుగా నిపుణులు చెబుతున్నారు. కాక్‌టైల్ ట్రీట్‌‌మెంట్‌కు డెల్టా ప్లస్ మ్యూటెంట్ లొంగడం లేదని తెలుస్తోంది. యూరప్‌లో మార్చి నుంచి కొత్త వేరియెంట్ కనిపిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. డెల్టా ప్లస్‌పై మరింత అధ్యయనం జరగాల్సి వుందని ఆయన చెప్పారు. అయితే ఇండియాలో ఈ కేసులు అంత‌గా లేవ‌ని, అందువ‌ల్ల ఈ వేరియంట్‌పై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

Also Read:వ్యాక్సిన్ తో తొలి మరణం.. ధృవీకరించిన కేంద్రప్రభుత్వం..

ఇండియా నుంచి జూన్ 7 వ‌ర‌కు ఆరు జీనోమ్స్‌లో ఈ డెల్టా ప్ల‌స్ వేరియంట్ క‌నిపించింది. ఈ నెల 7వ తేదీ వ‌ర‌కూ జీఐఎస్ఏఐడీలో 63 జీనోమ్స్‌ల‌లో డెల్టా ప్ల‌స్ వేరియంట్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఇవి కెన‌డా, జ‌ర్మ‌నీ, ర‌ష్యా, నేపాల్‌, స్విట్జ‌ర్లాండ్‌, ఇండియా, పోలాండ్‌, పోర్చుగ‌ల్‌, జపాన్‌, అమెరికాల నుంచి వ‌చ్చిన‌వి. ఈ వేరియంట్ కేసులు యూకేలో 36, అమెరికాలో మొత్తం కేసుల్లో 6 శాతం ఉన్న‌ట్లు గుర్తించారు.

click me!