ఒక్కడికి తప్ప.. గ్రామం మొత్తం కరోనా..!

By telugu news teamFirst Published Nov 19, 2020, 9:12 AM IST
Highlights

క్క వ్యక్తికి తప్ప.. ఆ గ్రామంలో అందరికీ కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంకేముంది.. అందరూ హాయిగా తిరిగేస్తుంటే.. కరోనా లేనందుకు అతను క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. 

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా పేరే వినపడుతోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది. మన దేశంలోనూ ఈ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. ఎవరైనా తుమ్మినా, దగ్గినా కూడా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా..  ఇప్పటి వరకు ఈ మహమ్మారి వ్యాక్సిన్ కూడా కనుగొనలేకపోయారు.

కాగా.. కరోనా లక్షణాలు కనపడగానే.. వారంతా క్వారంటైన్ లోకి గానీ.. ఐసోలేషన్ లోకి గానీ వెళ్లిపోతున్నారు. అలా ఉంటే.. తమ నుంచి వేరే ఎవరికీ కరోనా సోకకుండా ఉంటుందని అలా చేస్తూ వస్తున్నారు. అయితే.. ఓ గ్రామంలో విచిత్రం చోటుచేసుకుంది. ఒక్క వ్యక్తికి తప్ప.. ఆ గ్రామంలో అందరికీ కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంకేముంది.. అందరూ హాయిగా తిరిగేస్తుంటే.. కరోనా లేనందుకు అతను క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లోని జన్‌జాతీయ జిల్లా లాహౌల్-స్పీతి పరిధిలోని థొరాంగ్ గ్రామంలో ఒక వ్యక్తికి మినహా 42 మందికి కరోనా సోకింది. ఈ వ్యక్తి కుటుంబంలో అతను మినహా అతని భార్యతో పాటు కుటుంబంలోని ఆరుగురికి కూడా కరోనా సోకింది. గ్రామంలో కరోనా సోకని వ్యక్తిగా భూషన్ ఠాకుర్(52) ఒక్కరే నిలిచారు. 

తాను కరోనా సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నందునే వ్యాధి బారిన పడలేదని తెలిపారు. ఈ సందర్భంగా లాహౌల్- స్పీతికి చెందిన వైద్యులు డాక్టర్ పల్జోర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన భూషన్ ఇమ్యూనిటీ సిస్టం సమర్థవంతంగా పనిచేస్తున్నదన్నారు. 

గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్ వచ్చి, భూషన్‌కు మాత్రం నెగిటివ్ రావడం విచిత్రంగా అనిపించిందన్నారు. గ్రామానికి చెందిన ఐదుగురు ఇంతకుముందే పాజిటివ్‌గా తేలారని, ఈ నేపధ్యంలోనే గ్రామంలోని వారంతా స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్నారన్నారు.

 ఈ గ్రామంలో మొత్తం 100 మంది ఉంటారని, మంచుకురుస్తున్న కారణంగా కొంతమంది కూలూ ప్రాంతానికి వెళ్లిపోయారని అన్నారు. కాగా కరోనా సోకని భూషన్ తన ఇంటిలోని వారికి దూరంగా ఒక గదిలో ఒక్కడే ఉంటున్నాడు. స్వయంగా వంట వండుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషన్ కూడా కరోనా టెస్టు చేయించుకున్నాడు. అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాకు తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతోపాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడనది భూషన్ చెబుతున్నాడు. 

click me!