యాంటీబాడీ కాక్ టెయిల్ తొలి డోసు వేసుకున్న 82 యేళ్ల వృద్ధుడు.. డిశ్చార్జ్ అయి ఇంటికి...

By AN TeluguFirst Published May 27, 2021, 11:56 AM IST
Highlights

కరోనా చికిత్సలో యాంటీ బాడీ కాక్ టెయిల్ ను దేశంలో తొలిసారిగా వినియోగించారు.  హర్యానా కు చెందిన 82 యేళ్ల కోవిడ్ బాధితుడికి రెండు రోజుల క్రితం తొలి డోసు ఇవ్వగా.. ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి మేదాంతా ఛైర్మన్ డాక్టర్ నరేష్ త్రెహాన్ వెల్లడించారు. అయితే డిశ్చార్జ్ అయినప్పటికీ ఆ రోగిని ప్రతిరోజు పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు.

కాసిరివిమాబ్, ఇమ్దెవిమాబ్ అనే రెండు రకాల యాంటీబాడీలను కలిపి తొలిదశలోనే కరోనా బాధితులకు ఇచ్చినట్లయితే...ఇవి వైరస్ కణాలను శరీరమంతా వ్యాపించకుండా అడ్డుకుంటాయి. కోవిడ్ 19, బి.1617 రకం వేరియంట్ పై ఇది సమర్థంగా పనిచేస్తుంది. ఈ యాంటీ బాడీ కాక్ టెయిల్ ద్వారా రోగులు ఆస్పత్రికి వెళ్లే అవసరం 70 శాతం తగ్గిపోతుంది. 

మన దగ్గర తొలి డోసును హర్యానాకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చాం. డోసు తీసుకున్న మరుసటి రోజు ఆయనను డిశ్చార్జి చేశాం. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. మహమ్మారిపై ఇది మన కొత్త ఆయుధం లాంటిది.. అని నరేష్ త్రెహాన్ వివరించారు.

కోవిడ్ వైరస్ ని ఎదుర్కొనే 2 యాంటీబాడీలను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను ఇటీవల రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా భారత మార్కెట్లో విడుదల చేశాయి. దీని ధర డోసుకు రూ. 59,750గా పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరుడు కరోనా బారిన పడినప్పుడు ఈ ఔషధాన్ని తీసుకునే వైరస్ నుంచి కోలుకున్నారు. 

click me!