బెదిరించిన మాజీ ప్రియుడ్ని ఏం చేసిందంటే...

Published : Sep 02, 2018, 02:31 PM ISTUpdated : Sep 09, 2018, 12:41 PM IST
బెదిరించిన మాజీ ప్రియుడ్ని ఏం చేసిందంటే...

సారాంశం

తన నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడిన మాజీ ప్రియుడిని ఓ యువతి కిరాతకంగా హతమార్చింది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రాణాలు తీసింది. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాబోయే భర్త సాయంతో యమునా నదిలో విసిరేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటు చేసుకుంది. 

ఢిల్లీ : తన నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడిన మాజీ ప్రియుడిని ఓ యువతి కిరాతకంగా హతమార్చింది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రాణాలు తీసింది. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాబోయే భర్త సాయంతో యమునా నదిలో విసిరేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే సుశీల్‌ కుమార్‌ (23), డాలీ చౌదరీ (20) కొంతకాలం కలిసి మెలిసి ఉండేవారు. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత డాలీ చౌదరి తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్‌ మావితో స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల్‌ డాలీపై బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలని, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. 

సుశీల్ బెదిరింపులతో ఆందోళన చెందిన డాలీచౌదరి పరువుపోతుందన్న భయంతో అతన్ని అంతమొందించాలని భావించింది. తాను పెళ్లిచేసుకోబోతున్న మనీష్‌ చౌదరీతో వ్యవహారం అంతా చెప్పింది. హత్యకు పథకం రచించింది. ఓ హోటల్‌లో ఆగస్టు 11న డాలీ సుశీల్‌ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతని చేత తాగించింది. సుశీల్ చనిపోయిన తర్వాత మృతదేహాన్నికాబోయే భర్త మనీష్‌తో కలిసి యమునా నదిలో పడేసింది. 

అయితే తమ కుమారుడు కనిపించడం లేదని సుశీల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సుశీల్‌ తన ప్రేయసి డాలీ చేతిలో హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. నిందితురాలు డాలీ ఆమెకు సహకరించిన కాబోయే భర్త మనీష్‌లను అరెస్టు చేశారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !