లాక్ డౌన్: అత్తామామలను చంపిన మహిళ, ఇంట్లోనే భర్త

By telugu teamFirst Published Apr 24, 2020, 4:38 PM IST
Highlights

దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓ 35 ఏళ్ల మహిళ పశ్చిమ ఢిల్లీలో అత్తామామలను హత్య చేసింది. ఈ హత్యలు జరిగిన సమయంలో ఆమె భర్త, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.

న్యూఢిల్లీ: దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న వేళ పశ్చిమ ఢిల్లీలో 35 ఏళ్ల మహిళ తన అత్తామామలను చంపేసింది. హత్య జరిగిన సమయంలో నిందితురాలు కవిత భర్త, ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. కవిత భర్తతో పాటు ఆరేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. 

హత్య కేసులో కవిత భర్తను కూడా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జంట హత్యల గురించి పోలీసులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు సమాచారం అందింది. రాజ్ సింగ్ (61), ఓంవతి (58)లను కవిత తొలుత గొంతు నులిమింది. ఆ తర్వాత కత్తితో పొడిచింది. ఈ హత్యలో 37 ఏళ్ల సతీష్ సింగ్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. 

ఛావ్లాలోని బెడ్రూంలో ఇద్దరి శవాలు పడి ఉన్ాయి. ఛావ్లాలోని దుర్గా విహార్ ఫేజ్ 2లో జరిగిన హత్యల గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి శవాలు గదిలో పడకపై పడి ఉన్నాయి. ముఖాలపై పదునైన ఆయుధంతో గాయం చేసిన గుర్తులున్నాయి. 

ఆస్తి తగాదాలు హత్యలకు కారణమై ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కవితను, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, అరెస్టు మాత్రం చేయలేదు. 

click me!