బీజేపీ ఎంపీ ఆత్మహత్య: రూమ్‌లోనే ఉరేసుకొన్న రామ్ స్వరూప్ శర్మ

By narsimha lodeFirst Published Mar 17, 2021, 11:41 AM IST
Highlights

బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బుధవారం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆయన మరణించినట్టుగా  పోలీసులు తెలిపారు. రామ్ స్వరూప్ శర్మ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
 


న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బుధవారం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆయన మరణించినట్టుగా  పోలీసులు తెలిపారు. రామ్ స్వరూప్ శర్మ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

శర్మ వయస్సు 62 ఏళ్లు. తన రూమ్ లో ఏంపీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.తన రూమ్ లోపలి నుండి లాక్ చేసుకొని ఉరేసుకొన్నాడని పోలీసులు తెలిపారు.ఎంపీ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెప్పారు.ఎంపీ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్టుగా సమాచారం.

తాను పిలిచినా పలకపోవడంతో ఎంపీ అసిస్టెంట్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల బృందం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూసేసరికి ఎంపీ ఉరేసుకొని చనిపోయినట్టుగా పోలీసులు చెప్పారు.

శర్మ రెండు దఫాలు ఎంపీగా విజయం సాధించాడు. 2014, 2019 ఎన్నికల్లో మండి ఎంపీ స్థానం నుండి ఆయన విజయం సాధించారు.శర్మ మరణంతో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేసుకొంది.

click me!