దొంగతనం కోసం వెళ్లి మహిళను దారుణంగా హతమార్చి.. ఆ తర్వాత..!

By Mahesh KFirst Published Jan 14, 2022, 6:09 AM IST
Highlights

ఢిల్లీలో దొంగతనం కోసం వెళ్లి ఓ మహిళను దారుణంగా హతమార్చారు. లోనికి చెందిన ఓ వ్యాపారి.. తన బిజినెస్‌తో సంబంధాలు ఉన్న ఓ మహిళ కుటుంబం దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టు భావించి చోరీకి ప్లాన్ వేశాడు. మరో ముగ్గురిని వెంటబెట్టుకుని ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. బిజినెస్ డీలింగ్స్ పేరుతో ఇల్లు చేరి ఆమె ధరించిన నగలను చోరీ చేశారు. ఆమెపై బ్రిక్స్‌తో దాడి చేసి ఆపై కత్తులతో గొంతు కోశారు.
 

న్యూఢిల్లీ: దేశరాజధాని Delhiలో దారుణం జరిగింది. దొంగతనం(Robbery) చేయడానికి వెళ్లిన నలుగురు దుండగులు ఆ ఇంటి యజమాని అయిన 52 ఏళ్ల మహిళను దారుణంగా హతమార్చారు. ఓ ఇటుకతో తలపై మోది తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత కత్తులతో ఆమె గొంతను కోశారు(Throat Slit). ఈ నెల 11వ తేదిన కారావల్ నగర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను దర్యాప్తు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు దుండగులను పట్టుకున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని లోనికి చెందిన వారని ఈశాన్య ఢిల్లీ డీఎస్పీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. ఆ నలుగురిని అమన్, ఆకాశ్, మనీష్, వైభవ్ జైన్‌లుగా పోలీసులు గుర్తించారు.

అమన్, ఆకాశ్‌లపై లోనీలోనూ ఓ కేసు నమోదైంది. ఓ వృద్ధ మహిళ హత్యగావించిన కేసులో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. అమన్ స్కూల్ యూనిఫామ్‌లకు సంబంధించి వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు లోనిలో ఓ ఫ్యాక్టరీ కూడా ఉన్నది. ఢిల్లీలో హతమార్చిన మహిళ కుటుంబానికీ ఆయన వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయి. అయితే, ఆమె ఇంటి వద్ద ధనం విరివిగా ఉన్నదని భావించి తన మిత్రులతో చోరీ ప్లాన్ వేశాడని పోలీసులు వెల్లడించారు. ఆ రోజు వారంతా కలిసి ఆ మహిళ ఇంటికి చేరారు. కొన్ని బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయని పేర్కొంటూ వారంతా ఆమె ఇంటికి చేరారు. అక్కడి నుంచి గోడౌన్‌ వరకు వెళ్లారు. అక్కడే ఆమె ధరించిన విలువైన నగలను తస్కరించారు. అది గమనించి ఆమె ప్రతిఘటించగా... ఆమెపై ఇటుకతో దాడి చేశారు. ఆ తర్వాత ఆమె గొంతును కొసేశారు.

ఆ తర్వాత ఇంటిలోకి వెళ్లి నగదును చోరీ చేయాలని యోచించారు. కానీ, వారికి అంతలోనే తమ ప్లాన్ వర్కవుట్ కాదని తెలిసింది. ఎందుకంటే.. ఆ మహిళ ఇంటిలోనే ఇరుగుపొరుగు వారు కొందరు ఉన్నట్టు వారికి చప్పుళ్లు వినిపించాయి. దీనితో వారంతా అక్కడి నుంచే వెనుదిరిగారు.

ఈ హత్యోదంతంపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటరాగేషన్ చేస్తుండగా, పోలీసులకు అమన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో వారు ఆయన కోసం గాలింపులు ప్రారంభించారు. కానీ, ఆయన ఇంటి వద్ద, ఫ్యాక్టరీ వద్ద కూడా కనిపించలేదు. ఆ తర్వాత ఆయనతోపాటు చోరీకి వచ్చినట్టుగా భావించిన వారి పేర్లనూ కనుగొన్నారు. వారి కోసం కూడా గాలింపులు జరిపారు. కానీ, వారంతా వారి వారి ఇళ్లల్లో లేరు. ఎట్టకేలకు ఢిల్లీలోని పాత రైల్వే స్టేషన్‌లో అమన్, మనీష్‌లను పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరినీ పోలీసులు పట్టుకోగలిగారు. కేసును ఛేదించారు.

నిజామాబాద్ జిల్లాలో (nizamabad district) దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి (indian oil bunk) దొంగలు చొరబడ్డారు. గుంపుగా బంక్ వెనుక గోడ దూకి లోపలికి వచ్చారు. మరికొందరు బంక్ ముందు కాపలా ఉండగా ఇద్దరు బంక్‌లోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేశారు. కర్రలు రాళ్లతో బంక్‌పై కూడా దాడికి తెగబడ్డారు. అనంతరం లోపలికి చొరబడి క్యాష్ కౌంటర్ (robbery) ఎత్తుకెళ్లారు. వీరి ధాటికి భయపడిన సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు.

click me!