ఫ్రిడ్జ్ మీది రక్తపు మరకలు పట్టించాయి... వృద్ధురాలి హత్యకేసులో కొత్తకోణం....!

By AN TeluguFirst Published Jul 15, 2021, 1:16 PM IST
Highlights

 మృతురాలిని ముక్కలుగా చేస్తున్నప్పుడు ఆమె రక్తం పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ మీద పడింది. దీన్ని నిందితులు గమనించలేదు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులకు ఫ్రిడ్జ్ మీద రక్తపు మరకలు దారి చూపించాయి. నిందితులను పట్టించాయి.

ఢిల్లీకి చెందిన 70 ఏళ్ల కవిత గ్రోవర్ హత్య కేసులో ఫ్రిడ్జ్ మీద రక్తపు మరకలు కీలకంగా మారాయి. వాటి ఆధారంగానే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు తను, అనిల్ ఆర్యా లు  కవిత గ్రోవర్ ను వాటర్ పైప్ తో గొంతు బిగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆమె శరీరాన్ని కత్తితో మూడు భాగాలుగా చేశారు. వాటిని స్థానిక కాలువలో పడేశారు.

ఇంట్లో రక్తపు మరకలు లేకుండా చేశారు. పలుమార్లు అంతా శుభ్రం చేశారు. అయితే, మృతురాలిని ముక్కలుగా చేస్తున్నప్పుడు ఆమె రక్తం పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ మీద పడింది. దీన్ని నిందితులు గమనించలేదు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులకు ఫ్రిడ్జ్ మీద రక్తపు మరకలు దారి చూపించాయి. నిందితులను పట్టించాయి. ఒకవేళ ఫ్రిడ్జ్ మీద రక్తపు మరకలు లేకపోయి ఉంటే నిందితులను పట్టుకోవడం చాలా కష్టం అయ్యేది అని పోలీసులు చెబుతున్నారు.

అప్పు తీర్చమందని.. వృద్ధురాలి గొంతుకోసి చంపి, ముక్కలు చేసి.. కాలువలోకి విసిరేసిన జంట... !

అనిల్ ఆర్య, అతని భార్య తను ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్ కవిత గ్రోవర్ వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించేవాడు.

ఈ నేపథ్యంలో వృద్ధురాలు తన అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేయసాగింది. అది జీర్ణించుకోలేక అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టుపెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్ తో గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. జూన్ 30న  హత్య జరగగా.. జూలై 1న మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి స్థానిక కాలువలో పడేశారు.
 

click me!