హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ: రాజ్‌భవన్ లో ప్రమాణం

By narsimha lodeFirst Published Jul 15, 2021, 1:08 PM IST
Highlights

హర్యానా గవర్నర్ గా  బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రమాణం చేశారు. గతంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. ఇటీవలనే ఆయనను హిమాచల్‌ప్రదేశ్ నుండి హర్యానాకు బదిలీ చేశారు.
 

చండీఘడ్: హర్యానా గవర్నర్ గా  బండారు దత్తాత్రేయ గురువారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఆయన  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు.  ఇటీవలనే పలు రాష్ట్రాల్లో గవర్నర్ల బదిలీతో పాటు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా బదిలీ చేశారు.

రెండు రోజుల క్రితమే దత్తాత్రేయ చంఢీఘడ్ కు చేరుకొన్నారు. దత్తాత్రేయకు సీఎం  మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో పలువురు మంత్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఇవాళ చంఢీఘఢ్‌లో గవర్నర్ గా బండారు దత్రాత్రేయను రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. 

రాజ్‌భవన్ లో  నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో  సీఎం ఖట్టర్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.2014లో మోడీ మంత్రివర్గంలో దత్తాత్రేయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు  గవర్నర్ పదవిని కట్టబెట్టింది బీజేపీ నాయకత్వం.


 

click me!