2047 నాటికి అభివృద్ధి భారత్ మా లక్ష్యం.. : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

Published : Jun 30, 2023, 01:18 PM IST
2047 నాటికి అభివృద్ధి భారత్ మా లక్ష్యం.. :  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

సారాంశం

PM Modi DU Visit: ప్రధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీ మెట్రోలో ప్ర‌యాణించారు. ఈ క్రమంలో ఇత‌ర ప్ర‌యాణికుల‌తో చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. శుక్ర‌వారం ఢిల్లీ యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని ఢిల్లీ మెట్రో ఎక్కి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.   

Delhi University 100 Years: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించడమే త‌మ ల‌క్ష్య‌మని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. దీనికి అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్నద‌ని తెలిపారు. కాగా, ప్రధాని ఢిల్లీ మెట్రోలో  ప్ర‌యాణించారు. ఈ క్రమంలో ఇత‌ర ప్ర‌యాణికుల‌తో చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. శుక్ర‌వారం ఢిల్లీ యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని ఢిల్లీ మెట్రో ఎక్కి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

దేశ రాజ‌ధానిలోని ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాలుపంచుకున్నారు. ఈ ఉత్స‌వాల‌ ముగింపు సభలో ప్రధాని ప్రసంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తనకు ఆహ్వానం అందగానే రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. "ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ఆనంద‌క‌ర వాతావరణంలో నాకు అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది, ఈ రోజు నేను మెట్రోలో యువ స్నేహితులతో సంభాషించడానికి వచ్చాన‌ని" చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. "అది ఏ దేశమైనా, దానిలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు దాని విజయాలకు నిజమైన చిహ్నాలు" అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం కేవలం ఒక విశ్వవిద్యాలయం కాదు, ప్ర‌తి క్షణం స‌జీవంగా నిలిచింది.  ఈ విశ్వవిద్యాలయం ప్రతి క్షణం జీవించింది, ఈ విశ్వవిద్యాలయం ప్రతి క్షణానికి జీవం పోసింద‌ని" అన్నారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఇటీవల తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రపంచంలో మన దేశానికి గౌరవం బాగా పెరిగిందని గ్రహించానని మోడీ అన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలిపారు. దేశ లింగ నిష్పత్తి మెరుగుపడిందనీ, భారతదేశం డ్రోన్ విధానంలో కూడా పెద్ద మార్పులు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు.

గత శతాబ్దపు మూడవ దశాబ్దం స్వాతంత్య్ర‌ పోరాటానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది, ఇప్పుడు ఈ శతాబ్దపు మూడవ దశాబ్దం భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. నేడు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్మితమవుతున్నాయి. మన విద్యాసంస్థలు ప్రపంచంలోనే తమదైన ముద్ర వేస్తున్నాయి. ఒకప్పుడు విద్యార్థులు ఇన్ స్టిట్యూట్ లో చేరే ముందు ప్లేస్ మెంట్స్ కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ నేడు యువత దానికి జీవితాన్ని ముడిపెట్టడం కాదు, కొత్తగా ఏదైనా చేయాలనే తపన పడుతున్నారు. తన సొంత నిర్ణ‌యాల‌ను, చ‌రిత్ర రాయాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్