షాక్: బీరువాలో మహిళ మృతదేహం, ఏమైందంటే?

Published : Aug 03, 2018, 03:37 PM IST
షాక్: బీరువాలో మహిళ మృతదేహం, ఏమైందంటే?

సారాంశం

న్యూఢిల్లీలో 26 ఏళ్ల  మహిళను హత్య చేసి  బీరువాలో దాచిపెట్టారు.  మృతదేహన్ని కాళ్లు, చేతులు  కట్టి ఆ బీరువాలో  ఉంచారు. ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో 26 ఏళ్ల  మహిళను హత్య చేసి  బీరువాలో దాచిపెట్టారు.  మృతదేహన్ని కాళ్లు, చేతులు  కట్టి ఆ బీరువాలో  ఉంచారు. ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  మహిళపై  హత్యకు ముందు అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఢిల్లీలోని  గోకల్‌పురి ప్రాంతంలో బీరువాలో  మహిళ మృతదేహం ఉన్న విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  ఈ హత్య అతనే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫోన్ చేసిన వ్యక్తికి పెళ్లై నలుగురు పిల్లలున్నారు.  అయితే తన భార్యను ఎవరో హత్య చేసి  బీరువాలో ఉంచారని పోలీసులకు చెప్పాడు. కానీ, ఆ తర్వాత  పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తొలుత తన భార్యగా చెప్పిన ఆ వ్యక్తి.... మృతురాలు తనకు తెలిసిన వ్యక్తిగా మాట మార్చాడు. అంతేకాదు  తనకు స్నేహితురాలు అని చెప్పాడని పోలీసులు చెబుతున్నారు.

మృతురాలు గోకల్‌పురిలోని చాంద్‌ భాగ్‌ ప్రాంతంలో ఒక గదిలో నివసిస్తోంది. స్థానికంగా ఓ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు. మహిళ హత్య జరిగి 36గంటలు దాటి ఉంటుందని తెలిపారు. ఆ మహిళకు, తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సంబంధం ఏంటనే విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్‌ల‌కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం