Omicron: ఢిల్లీలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు, ఇండియాలో మొత్తం ఐదుకి చేరిక

By narsimha lodeFirst Published Dec 5, 2021, 11:53 AM IST
Highlights


ఇండియాలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి ఒమిక్రాన్ కేసులు ఐదుకి చేరుకొన్నాయి. న్యూఢిల్లీలో తొలి కేసు నమోదైంది. కర్ణాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్రల్లో ఒక్కొక్క కేసులు నమోదయ్యాయి. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు ఐదుకి చేరుకొన్నాయి. గతంలో కర్ణాటకలో రెండు కేసులు నమోదు కాగా, గుజరాత్, మహారాష్ట్రల్లో నిన్న  ఒక్కొక్క కేసు నమోదైంది.Tanzania నుండి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి Satyendar Jain చెప్పారు. ఢిల్లీలోని LNJP hospital ఆసుపత్రిలో 17 మంది కరోనాతో చేరారని  ఆయన వివరించారు.

ఆసుపత్రిలో చేరిన తొమ్మిది మందికి గొంతు నొప్పి, జ్వరంతో బాధపడున్నారు. వీరి నమూనాలను టెస్టింగ్ కోసం పంపినట్టుగా అధికారలు తెలిపారు. ఫలితాలు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుంది.యూకే నుండి ముగ్గురు  కొత్త రోగులు ఆసుపత్రుల్లో చేరారని లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి సూపరింటెండ్త డాక్టర్ Suresh kumar చెప్పారు. Omicronకేసులు నమోదైన దేశాల నుండి సుమారు 15 మంది రోగులు ఢిల్లీలోని ఎన్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరారు.Delhiలో కరోనా పాజిటివ్ రేటు 0.08 శాతం పాజిటివ్ రేటుతో 51 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసులు 14,41, 295కి చేరాయి. ఢిల్లీలో కరోనా 14.15 లక్షలకు చేరుకొన్నాయని  ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

also read:క‌రోనా పంజా.. ఒక్క‌రోజే 2,796 మంది మృతి

 ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుండి  విమానాలను నిషేధించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గుజరాత్ లో  ఒకటి, కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వేకు వెళ్లిన 72 ఏళ్ల వ్యక్తికి గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన వ్యక్తికి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  దక్షిణాఫ్రికా దేశాల్లో మొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ తో గత వారం నమోదయ్యాయి.  
 

click me!