మానసిక చికిత్సలో ఉన్న ఢిల్లీ అత్యాచార బాధితురాలు.. షాక్ నుంచి కోలుకోని చిన్నారి...

Published : Aug 21, 2023, 03:30 PM IST
మానసిక చికిత్సలో ఉన్న ఢిల్లీ అత్యాచార బాధితురాలు.. షాక్ నుంచి కోలుకోని చిన్నారి...

సారాంశం

స్నేహితుడి కుమార్తె అయిన టీనేజర్ పై పదే పదే అత్యాచారానికి పాల్పడిన ఘటనలో చిన్నారి పానిక్ అటాక్స్ లో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. చికిత్సలో భాగంగా కౌన్సిలర్ కు ఆమె ఈ షాకింగ్ విషయాలు వెల్లడించింది. 

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర భయాందోళనలకు గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత తనపై జరిగిన వేధింపులను వైద్యులకు తెలపడంతో ఈ దారుణం వెలుగు చూసిందని వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

అక్టోబరు 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు ఐదు నెలల వ్యవధిలో అతని స్నేహితుడి కుమార్తె అయిన టీనేజ్‌ బాలికపై ప్రేమోదయ్ ఖాఖా పదే పదే అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ సమయంలో 14 ఏళ్ల బాలిక గర్భవతి అయ్యింది. ఖాఖా భార్య ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇంట్లోనే గర్భం పోయేందుకు అబార్షన్ మాత్రలు ఇచ్చిందని ఆరోపించారు.

స్నేహితుడి కూతురిపై నెలల తరబడి ఉన్నతాధికారి అత్యాచారం.. ఉద్యోగం నుంచి తొలగించిన సీఎం కేజ్రీవాల్

ఈ ఘటనలతో ఆ బాలిక తీవ్ర మానసిక అల్లకల్లోలానికి గురై, తీవ్ర భయాందోళనలకు గురయ్యింది. డిప్రెషన్ లోకి వెళ్లింది. దీంతో కంగారు పడ్డ ఆమె తల్లి ఆమెను ఆస్పత్రికి తరలించింది. బాలికకు అక్కడ మానసిక చికిత్స అందించారు, ఆ సమయంలో ఆమె తన తండ్రి స్నేహితుడు, తాను "మామా" (మామ) అని పిలిచే వ్యక్తి తన మీద పదే పదే చేసిన లైంగిక వేధింపుల గురించి వైద్యులకు చెప్పింది.

దీంతో షాక్ అయిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు, మైనర్ పై అత్యాచారం కింద కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. బాలిక ఆసుపత్రిలో చేరిన వారం తర్వాత ఆగస్టు 13న కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి సాగర్ సింగ్ కల్సి తెలిపారు.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం,  2020లో బాలిక తండ్రి మరణించాడు. ఖాఖా అమ్మాయి తండ్రికి స్నేహితుడు. అతని మరణం తరువాత, అమ్మాయి తల్లి అతనితో, అతని భార్యతో కలిసి ఉండటానికి ఖాఖా ఉండే బురారీ ఇంటికి ఆమెను పంపింది. అక్కడ ఆమె ఉన్న ఐదు నెలల పాటు, ఆమె మీద పదేపదే అత్యాచారం జరిగిందని ఎఫ్ఐఆర్ లో తేలింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉండడం వల్ల బాలిక ఇంకా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదు. అయితే, ఆమెకు కాస్త మెరుగైన వెంటనే ఈ వ్యవహారాన్ని పూర్తి చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో అధికారిపై ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, "సమాజాన్ని అల్లకల్లోలం చేసే" ఒక "హీనమైన చర్య"కు అధికారి పాల్పడ్డారని అన్నారు. అందరికీ ఆడపిల్లలు ఉన్నారని, ఇది చాలా సిగ్గుమాలిన చర్య అని, ఆ అధికారిని చట్టపరంగా పూర్తి స్థాయిలో శిక్షించాలని అన్నారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఖాఖాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ‘‘కూతుళ్లను రక్షించడమే పనిగా పెట్టుకున్న వాడు వేటగాడుగా మారితే ఇక ఆడపిల్లలు ఎక్కడికి పోతారు? ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !