ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ: అమిత్ షా చేతికి పోలీసుల నివేదిక

Siva Kodati |  
Published : Jan 27, 2021, 02:35 PM IST
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ: అమిత్ షా చేతికి పోలీసుల నివేదిక

సారాంశం

ఢిల్లీలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎర్రకోటను కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ పరిశీలించారు. మరోవైపు టిక్రీ సరిహద్దు వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది.

ఢిల్లీలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎర్రకోటను కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ పరిశీలించారు. మరోవైపు టిక్రీ సరిహద్దు వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలపై దేశం ఉలిక్కిపడింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తలమునకలై వున్న అధికారులు.. ఢిల్లీలో జరిగిన విధ్వంసంపై ఆలస్యంగా కళ్లు తెరిచారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఢిల్లీ పోలీసులు నివేదిక అందజేశారు. ఈ వ్యవహారంపై ఇంత వరకు 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 200 మందిని అరెస్ట్ చేశారు.

Also Read:ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింస: 22 కేసులు నమోదు

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు ఈ కేసును అప్పగించే అవకాశం వుంది. రైతుల్లో సంఘ వ్యతిరేక శక్తులు కలిసిపోయారని .. రూట్ మ్యాప్‌ను మార్చి వ్యూహాత్మకంగా ఎర్రకోటపై దాడికి తెగబడ్డారని తెలుస్తోంది.

కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఎర్రకోటపై దాడి వెనుక గల కుట్రపై చర్చ జరిగింది. మరోవైపు రైతులెవ్వరూ ఢిల్లీలో ఉండకూడదని, తిరిగి వచ్చేయాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !