Asaduddin Owaisi: AIMIM చీఫ్‌ పై ఢిల్లీ పోలీసులు సీరియ‌స్.. FIR నమోదు

Published : Jun 09, 2022, 01:25 PM IST
 Asaduddin Owaisi: AIMIM చీఫ్‌ పై ఢిల్లీ పోలీసులు సీరియ‌స్.. FIR నమోదు

సారాంశం

Asaduddin Owaisi: AIMIM నేత అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం  వంటి పలు ఆరోపణలపై ఆయ‌న‌తో పాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు.  

Asaduddin Owaisi: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఊహించ‌ని షాక్ త‌గిలింది. రెచ్చగొట్టే ప్రకటనలకు చేశారంటూ.. ఢిల్లీ పోలీసులు గురువారం నాడు  ఒవైసీపై కేసు న‌మోదు చేశారు. ద్వేషపూరిత ప్ర‌సంగాలు చేయ‌డం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు హాని క‌లిగించ‌డం, సామాజిక మాధ్యమాల్లో అసత్యం, తప్పుడు సమాచారం చేయ‌డం వంటి ఆరోపణలపై ఒవైసీ (Asaduddin Owaisi) పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు IFSSO ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది.  అదే స‌మయంలో దాస్నా దేవి ఆలయ పూజారి యతి నర్సింహానంద్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైంది. మతపరమైన వివాదాస్పద చేసిన‌ వ్యాఖ్యలు చేసిన‌ బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

 

ఇదిలావుండగా, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ.. త‌న‌కు హ‌త్య బెదిరింపులు వస్తున్నాయని  ఫిర్యాదు చేయ‌డంతో ఆమెకు భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మైనారిటీలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆదివారం సస్పెండ్ చేసింది. శర్మను సస్పెండ్ చేస్తూ.. బిజెపి "అన్ని మతాలను గౌరవిస్తుంది"  "ఏదైనా శాఖ లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే ఏ భావజాలానికి తాము వ్యతిరేకం" అని పేర్కొంది. బీజేపీ నాయకురాలు వ్యాఖ్యల‌ను గల్ఫ్ దేశాల తీవ్ర వ్య‌తిరేఖిస్తున్నాయి. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది. 

ఇదిలా ఉంటే..  నూపుర్ శర్మను వ్యతిరేకిస్తూ .. నేడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుపుర్ శ‌ర్మ‌, నవీన్ జిందాల్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుప‌నున్న‌ది. మ‌రో వైపు .. హిందూ మహాసభ నుపుర్ శర్మకు మద్దతుగా లక్నోలో పాదయాత్ర చేపట్టనుంది.
 
అంతకుముందు రోజు.. AIMIS చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మీడియాతో మాట్లాడుతూ..  నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్య‌లు క్షమించ‌లేనివ‌నీ, తన ప్రకటనలో ఇంగ్లీషులో 'ఇఫ్' అని రాసిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ల రాజకీయాలు చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.  ఏదైనా జరిగినప్పుడు.. అది బుల్‌డోజర్‌లను నడుపుతుంది, కాబట్టి ఇప్పుడు నుపుర్ శర్మ ఇంట్లో బుల్‌డోజర్ నడుస్తుందా? దేశంలోని ముస్లింల విషయానికి వస్తే ప్రధాని మోదీ తమ మాట వినడం లేదన్నారు. ప్రధానికి భారతీయ ముస్లింల బాధలు అర్థం కావడం లేదనీ, దేశంలోని ముస్లింలను బీజేపీ కించపరిచిందని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !