ఢిల్లీలో కాల్పులు: కానిస్టేబుల్‌కు గాయాలు

Published : Feb 26, 2021, 11:02 AM IST
ఢిల్లీలో కాల్పులు: కానిస్టేబుల్‌కు గాయాలు

సారాంశం

ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు.

ఢిల్లీలోని భల్సావా డైరీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.పోలీస్ చెక్‌పోస్టు ప్రాంతంలో బైక్ పై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు ఆపితే బైక్ పై ముగ్గురు పారిపోయారు.ఈ క్రమంలో వారిని పట్టుకొనేందుకు కానిస్టేబుల్ వెంటాడాడు.దీంతో ముగ్గురు కానిస్టేబుల్ పై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు కానిస్టేబుల్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.నిందితులు అక్కడే బైక్ ను వదిలి వెళ్లారు. ఈ బైక్ ను దొంగిలించినట్టుగా పోలీసులు గుర్తించారు. సమీపంలోని వారే ఈ బైక్ ను దొంగిలించారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌