ప్రియుడి మీద కోపం.. ఆటో నుంచి కిందపడి యువతి మృతి

Published : Feb 26, 2021, 09:50 AM ISTUpdated : Feb 26, 2021, 10:58 AM IST
ప్రియుడి మీద కోపం.. ఆటో నుంచి కిందపడి యువతి మృతి

సారాంశం

హృతిక్ తన ప్రియురాలైన పరంజీత్ కౌర్ ను ఆటోలో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో మహిళ తన మొబైల్ ఫోన్ ను ఆటోలో నుంచి కిందకు విసిరివేసింది. 


ప్రియుడితో గొడవ.. ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది.  ప్రియుడితో గొడవ పడిన ప్రియురాలు ఆటోలో నుంచి కిందపడి మరణించిన ఘటన ఢిల్లీలో తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ కళ్యాన్ పురి నివాసి పరంజీత్ కౌర్ మోతీబాగ్ నానక్ పురాలో నివాసముంటున్న హృతిక్ ను ప్రేమించింది. ప్రేయసీ, ప్రియులు ఆశ్రమ చౌక్ వద్ద ఆటోరిక్షా ఎక్కబోతున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

హృతిక్ తన ప్రియురాలైన పరంజీత్ కౌర్ ను ఆటోలో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో మహిళ తన మొబైల్ ఫోన్ ను ఆటోలో నుంచి కిందకు విసిరివేసింది. రోడ్డుపై విరిగిన ఫోన్ తీసుకొని ఆటో ప్రయాణిస్తున్నారు. అంతలో మహిళ ఎన్ హెచ్ 24 ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నపుడు ఆటోలో నుంచి కిందకు దూకింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడు హృతిక్ ను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం