ఢిల్లీలో రైతుల ఆందోళనలు: ట్రాఫిక్ మళ్లింపు

By narsimha lodeFirst Published Dec 2, 2020, 11:03 AM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు బుదవారం నాటికి ఏడో రోజుకు చేరుకొన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు తమ ఆంధోళనను మరింత ఉధృతం చేశారు.

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు బుదవారం నాటికి ఏడో రోజుకు చేరుకొన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు తమ ఆంధోళనను మరింత ఉధృతం చేశారు.

రైతుల ఆందోళనతో ఢిల్లీకి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ నుండి ఢిల్లీకి వెళ్లే  మార్గం మూసివేశారు.

ఢిల్లీకి వచ్చేందుకు చిల్లా మార్గంలో రావొద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. ఢిల్లీకి రావాలంటే కలిండి కుంజ్ రహదారిని ఎంచుకోవాలని పోలీసులు ప్రయాణీకులను కోరారు.

గౌతమ్ బుద్ సమీపంలో రైతులు నిరసన కొనసాగిస్తున్నందున చిల్లా మార్గాన్ని మూసివేశారు. రైతు సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

రైతుల ఆందోళనల నేపథ్యంలో పలు రైళ్లను కూడ రద్దు చేశారు. ఆజ్మీర్ -అమృత్ సర్, దిరుగడ్- అమృత్ సర్ రైళ్లతో పాటు మరికొన్ని రైళ్లను  రైల్వేశాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించారు.

click me!