కరోనాకు బలైన బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్

Bukka Sumabala   | Asianet News
Published : Dec 02, 2020, 10:04 AM IST
కరోనాకు బలైన బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్

సారాంశం

కరోనా మహమ్మారి ప్రముఖులను ఒక్కొక్కరిగా బలి తీసుకుంటోంది. తాజాగా కరోనా సోకి మరో ఎంపీ కన్నుమూశారు. గుజరాత్ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ కోవిద్ 19 తో కన్నుమూశారు. 

కరోనా మహమ్మారి ప్రముఖులను ఒక్కొక్కరిగా బలి తీసుకుంటోంది. తాజాగా కరోనా సోకి మరో ఎంపీ కన్నుమూశారు. గుజరాత్ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ కోవిద్ 19 తో కన్నుమూశారు. 

కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహమ్మారి పీడ పూర్తిగా  వీడలేదు. సామాన్యులతో పాటు, రాజకీయ, సినీ ప్రముఖులు దీనికి బలైపోతున్నారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్ కు ఈ ఏడాది ఆగస్టులో కరోనా సోకింది. 

దీంతో ఆయనకు రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందించారు. చికిత్స సమయంలోనే తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. 

అయినా పరిస్థితి మెరుగు కాక పోవడంతో భరద్వాజ్ మంగళవారం ప్రాణాలు విడిచారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో నవంబర్ 26న మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఒక వారంలోనే ఇద్దరు రాజ్యసభ ఎంపీలను గుజరాత్‌ కోల్పోయింది. 

ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కోట్‌కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది భరద్వాజ్ ఈ ఏడాది జూలైలో  రాజ్యసభకు ఎన్నికయ్యారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu