శుభకార్యానికి వెళ్లివస్తూ... ఇసుక లారీ ఢీకొని ఎనిమిది మంది మృతి

Arun Kumar P   | Asianet News
Published : Dec 02, 2020, 10:40 AM IST
శుభకార్యానికి వెళ్లివస్తూ... ఇసుక లారీ ఢీకొని ఎనిమిది మంది మృతి

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఇవాళ  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి స్కార్పియో వాహనంలో తిరిగి వస్తుండగా ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం బందువుల ఇంట్లో జరిగిన పెళ్లివేడుకను ముగించుకుని ఓ మదిమంది తమ స్వస్థలానికి స్కార్పియో వాహనంలో బయలుదేరారు. అయితే తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ఇసుక లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను కూడా వాహనంలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న పదిమందిలో ఎనిమిది మంది మృతిచెందగా కేవలం ఇద్దరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా శుభకార్యానికి వెళ్లిన వారు మృతదేహాలుగా తిరిగి రావడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నిండింది.

 
 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit