ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం.. కాసేపట్లో మీడియా ముందుకు కేజ్రీవాల్..

By Sumanth KanukulaFirst Published Dec 7, 2022, 2:42 PM IST
Highlights

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ  పార్టీ విజయం సాధించింది.  మొత్తం 250 వార్డులకు గానూ.. ఆప్ 133 వార్డులు సొంతం చేసుకోగా, మరో స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ  పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం రోజున పోలింగ్ జరగగా... బుధవారం  ఓట్ల  లెక్కింపు చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. 126 వార్డులను గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ మెజారిటీ మార్క్‌ను అధిగమించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆప్ 133 వార్డులు సొంతం చేసుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థులు 103 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో విజయం సాధించగా.. మరో రెండు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు మూడుచోట్ల విజయం సాధించారు. 

ఆప్ విజయంపై స్పందించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఢిల్లీ ఎంసీ‌డీలో ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసించినందుకు ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా.. ఢిల్లీ ప్రజలు నిజాయితీగా, పని చేసే అరవింద్ కేజ్రీవాల్‌‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’’ అని మనీష్ సిసోడియా

అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఢిల్లీలో ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. అయితే బీజేపీ కూడా తమ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే బీజేపీ విజయం సాధించకపోయినా గట్టి పోటీ ఇచ్చిందనే ఫలితాలను బట్టి అర్థం అవుతుంది. బీజేపీ వరుసగా నాలుగోసారి ఎంసీడీలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆ పార్టీ ఆశ మాత్రం నెరవేరలేదనే చెప్పాలి. 

ఇక, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో విజయం సాధించడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కాసేపట్లో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. 

click me!