
ఢిల్లీ : ఉత్తర delhiలోని Massage Parlourలో నిర్వహిస్తున్న Sex racket ముఠా బారి నుండి 27 ఏళ్ల మహిళను పోలీసుల సహాయంతో Delhi Commission for Women రక్షించారు. ఈ మేరకు పోలీస్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మసాజ్ పార్లర్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సోమవారం కమిషన్‌కు ఫిర్యాదు అందిందని ఆ అధికారి తెలిపారు. అంతేకాదు.. అక్కడ ఓ 27 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"ఫిర్యాదు స్వీకరించిన వెంటనే, కమీషన్ బృందం ఢిల్లీ పోలీసులతో కలిసి సదరు మసాజ్ పార్లర్ కు చేరుకుని మహిళను రక్షించింది" అని DCW తెలిపారు. ఉద్యోగం కోసం `ఆజాద్‌పూర్, నీతికా టవర్ లోని గేట్‌వే మసాజ్ పార్లర్`కి వెళ్లినట్లు ఆ మహిళ కమిషన్‌కు తెలిపింది. అక్కడికి వెళ్లిన కాసేపటికి తనకు మత్తు మందు ఇచ్చారని, ఆ తర్వాత నెమ్మదిగా స్పృహ కోల్పోయానని ఆ మహిళ చెప్పింది. ఆ తర్వాత, ఆమెను అప్పటికే నగ్నంగా ఉన్న జంట ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఎవరో తనపై అత్యాచారానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.
ఈ సంఘటనను గమనించిన DCW చైర్‌పర్సన్ స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. ఈ విషయంలో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు, ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణాత్మక నివేదికను ఇవ్వాలని కోరారు. మసాజ్ పార్లర్ లో అరెస్టు చేసిన వారి వివరాలు, బాలికలను రక్షించిన వారి వివరాలను కూడా కమిషన్ కోరింది.
సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ప్రాంగణాన్ని సీల్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కమిషన్ పోలీసులు, ఎంసీడీని కోరింది. మసాజ్ పార్లర్‌కు మంజూరైన లైసెన్స్ వివరాలను, MCD ప్రాంగణంలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల వివరాలను అందించాలని MCDని కోరింది.
"స్పా, మసాజ్ సెంటర్లలో సెక్స్ రాకెట్లు నడుస్తున్నాయని మేం తరచుగా చెబుతూనే ఉన్నాం. ఢిల్లీలోని స్పా, మసాజ్ పార్లర్లలో నడుస్తున్న అనేక సెక్స్ రాకెట్లను ఛేదించాం. అయినా కూడా ఇప్పటికీ వేలాది స్పాలు అక్రమంగా వ్యభిచార రాకెట్లను నిర్వహిస్తున్నాయి" అని మలివాల్ చెప్పారు. .ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు, ఎంసీడీల జవాబుదారీతనం తేల్చాల్సిన అవసరం ఉందని, ఈ flesh trade వెనుక ఉన్న కింగ్‌పిన్‌లతో పాటు వారితో కుమ్మక్కైన అధికారులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని మహబూబాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. prostitution gang గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారని Mahabubabad జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.
వెంటనే టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ గండ్రతి మోహన్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎడ్లపల్లి సతీష్ వారి సిబ్బందిని తీసుకుని జిల్లా కేంద్రంలోని రెడ్డి బజార్ లో గల ఒక గృహం మీద దాడి చేశారు. ఆ గృహంలో సర్వోదయ సంస్థలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నకొందరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కురవి మండలంలోని తాటి తండా గ్రామ పరిధిలో గల పిల్లిగుండ్ల తండకు చెందిన బానోతు రవి, రాజోలు గ్రామ పరిధిలో గల హరిసింగ్ తండాకు చెందిన మాలోతు మంగీలాల్ అలియాస్ లోకేష్, బంచరాయి తండాకు చెందిన భూక్యా కన్కి, మహబూబాద్ మండలంలోని పర్వతగిరికి చెందిన బాదావత్ సరోజ, సోమ్లా తండాకు చెందిన బాదావత్ రాములు (విటుడు) ఉన్నారు. కొంతమంది వ్యక్తులు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను ట్రాప్ చేసి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.